హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ICAR Exam: ICAR యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో బిహార్ స్టూడెంట్‌కు 99.96% మార్కులు.. అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలనేదే లక్ష్యంగా..

ICAR Exam: ICAR యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో బిహార్ స్టూడెంట్‌కు 99.96% మార్కులు.. అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలనేదే లక్ష్యంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో చిన్నతనం నుంచి కష్టపడిన విద్యార్థి.. ఆ కలను సాధించే మార్గంలో ఘనమైన ముందడుగు వేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తూ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

వ్యవసాయ శాస్త్రవేత్త (Agriculture Scientist) కావాలనే లక్ష్యంతో చిన్నతనం నుంచి కష్టపడిన విద్యార్థి.. ఆ కలను సాధించే మార్గంలో ఘనమైన ముందడుగు వేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తూ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. అతడే బిహార్‌ (Bihar) లోని బెగుసరాయ్ ప్రాంతానికి చెందిన రోహిత్ రంజన్(Rohit Ranjan). ఈ విద్యార్థి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ICAR) అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో (Exam) ఏకంగా 99.96 శాతం మార్కులు సాధించాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఉంటూ ఐసీఏఆర్ పరీక్షకు సిద్ధమయ్యాడు. తమ కుమారుడు భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్త కావాలని రోహిత్ రంజన్ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. రోహిత్‌ రంజన్‌ చదువు, ప్రిపరేషన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యవసాయ రంగంతో అనుబంధం

బెగుసరాయ్‌లోని ఖోదావంద్‌పూర్ బ్లాక్‌లోని మేఘోల్ గ్రామంలో నివసించే రోహిత్ తాత డాక్టర్ అవధేష్ కుమార్ సింగ్‌కు వ్యవసాయ రంగంతో అనుబంధం ఉంది. ఆయన వ్యవసాయ శాస్త్రవేత్తగా పదవీ విరమణ పొందారు. రోహిత్ రంజన్ తండ్రికి కూడా ఈ రంగంతో అనుబంధం ఉంది. కుటుంబ వారసత్వం కారణంగా రోహిత్ చిన్నతనం నుంచి వ్యవసాయం వైపు ఆసక్తి చూపాడు.

Tanishka: మూడు కోచింగ్‌ సెంటర్ల ప్రకటనల్లో టాపర్‌ ఒకే అమ్మాయి.. అలా ఎందుకంటే..?

వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే లక్ష్యం చదువుకొన్నాడు. కుటుంబమంతా వ్యవసాయ శాఖ సంబంధిత పనుల్లో ఉండటం తనకు సపోర్ట్‌గా రోహిత్‌ భావించాడు. చదువుకున్న కుటుంబంలో పుట్టి, వ్యవసాయానికి సంబంధించిన వాతావరణంలో పెరిగిన రోహిత్ రంజన్ SDSVM బటాహాలో 10వ తరగతి, MRJD కాలేజీ మేఘాల్‌లో 12వ తరగతి చదివాడు. దీని తరువాత పాట్నాలో ఉంటూ ఎగ్జామ్‌ ప్రిపరేషన్ ప్రారంభించాడు.

నిరంతర కృషితోనే ఫలితం

రోహిత్ తన ఆనందాన్ని న్యూస్18 హిందీతో పంచుకొన్నాడు. అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసీఏఆర్‌ నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. మెట్రిక్యులేషన్‌, ఇంటర్మీడియట్‌ చదువులు పూర్తయ్యాక వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో పరీక్షకు సన్నద్దం అయినట్లు వివరించాడు. ప్రతి రోజూ సమయం వృథా కాకుండా చదువుకోవడంతోనే మంచి మార్కులు సాధించగలిగినట్లు చెప్పాడు. పోటీపరీక్షలకు ముందు సరైన ప్రణాళిక అవసరమని సూచించాడు. నిపుణుల సలహాలు కూడా ఉపయోగపడతాయని వివరించాడు.

ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

రోహిత్ రంజన్ తండ్రి చిన్మయ్ పరాసర్ కూడా తన కొడుకును వ్యవసాయ శాస్త్రవేత్తగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కుమారుడికి అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆ దిశగానే ప్రోత్సహించామని అన్నారు. జిల్లాలోని విద్యార్థులందరూ చక్కగా చదువుకుని జిల్లా మొత్తానికి గుర్తింపు తేవాలనేది తన కోరిక అని పేర్కొన్నారు. రోహిత్ తల్లి సీమా కుమారి మాట్లాడుతూ.. తన కొడుకు గ్రామంలో ఉంటూ చదువుకున్నాడని, ఇంకా అభివృద్ధి చెందుతున్నాడని దీమా వ్యక్తం చేశారు. ఇది తమకు మరిచిపోలేని క్షణమని అన్నారు. భవిష్యత్తులో బిడ్డను ఉన్నత స్థానాల్లో చూడాలని ఆశపడుతున్నట్లు చెప్పారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Agriculture, Bihar, Career and Courses, Exams, JOBS, Success story

ఉత్తమ కథలు