• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • RML HOSPITAL DELHI INVITES APPLICATIONS FOR 329 VACANCIES HERE FULL DETAILS NS

RML Hospital Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఆస్పత్రిలో 329 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

RML Hospital Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఆస్పత్రిలో 329 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి(RML Hospital, Delhi) శుభవార్త చెప్పింది. జూనియర్ రెసెడెంట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    నిరుద్యోగులకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి(RML Hospital, Delhi) శుభవార్త చెప్పింది. జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను సంస్థ తాజాగా విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఆస్పత్రి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడుతుంది. నోటిఫికేషన్ ప్రకారం సీనియర్ రెసిడెంట్ విభాగంలో 202, జూనియర్ రెసిడెంట్ విభాగంలో 127 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన విధంగా దరఖాస్తులను పూర్తి చేసి ఆఫ్ లైన్లో పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను కింద ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.

    జూనియర్ రెసిడెంట్: రేడియాలజీ, డెర్మటాలజీ, సర్జరీ, అనెస్తీషియా, ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాక్ అనెస్తీషియా, ఈఎన్టీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటిరాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ తో పాటు గత డిసెంబర్ 31 నాటికి ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫిబ్రవరి 22 నాటికి 30 గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
    Notification1-Direct Link
    Notification2-Direct Link

    -సీనియర్ రెసిడెంట్ విభాగంలో మొత్తం 127 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రేడియాలజీ, సర్జరీ, డెర్మటాలజీ, అనెస్తీషియా, ఈఎన్టీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటిరాలజీ, గైనకాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమో/DNB ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫిబ్రవరి 22 నాటికి 45 ఏళ్లు నిండిన వారు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు