RITES Recruitment 2021: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

RITES Recruitment 2021: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

RITES Recruitment 2021 | భారతీయ రైల్వేకు చెందిన రైట్స్ లిమిటెడ్ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వేతో పాటు రైల్వేకు చెందిన పలు సంస్థలు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్‌కు రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీకి సంబంధించిన సేవలు అందించే రైట్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది రైట్స్ లిమిటెడ్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రైట్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.rites.com/ లో తెలుసుకోవచ్చు. ఎంపికైన వారికి రెండు నెలలు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఏడాది కాలానికి నియమిస్తారు. కంపెనీ అవసరాలను బట్టి భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.

    RITES Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 48
    గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్)- 25
    గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (మెకానికల్ ఇంజనీరింగ్)- 15
    గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 8

    Telangana Jobs: ఖాళీల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్

    Railway Jobs: రైల్వే జాబ్ అలర్ట్... మరో నోటిఫికేషన్ వచ్చేసింది... రూ.92,300 వరకు వేతనం

    RITES Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 30
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 25
    వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు, దివ్యాంగులకు రూ.300.
    విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్) పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ కావాలి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (మెకానికల్ ఇంజనీరింగ్) పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్‌, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ కావాలి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పోస్టుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ కావాలి. గేట్ 2020, గేట్ 2021 స్టోర్ తప్పనిసరి.
    వేతనం- రూ.40,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,40,000 వేతనం లభిస్తుంది.

    Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

    IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

    RITES Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://www.rites.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో కెరీర్ సెక్షన్‌లో Online Registration పైన క్లిక్ చేయాలి.
    పోస్టు పేరు సెలెక్ట్ చేసి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
    అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: