హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

RITES Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ రైల్వేకు చెందిన రైట్స్ లిమిటెడ్ 170 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

భారతీయ రైల్వే మాత్రమే కాదు ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 170 పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైట్స్ లిమిటెడ్. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టులున్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో ఇంజీరింగ్ డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు జనరల్ ఎలక్ట్రిఫికేషన్, సైట్ సూపర్‍విజన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ మెషీన్స్ అండ్ కన్‌స్ట్రక్షన్, మెయింటనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్, కన్‌స్ట్రక్షన్ సూపర్‍విజన్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, మెయింటనెన్స్ అండ్ ఆపరేషన్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 26 చివరి తేదీ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rites.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

SSC Recruitment 2020: ఇంటర్ పాసైనవారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... మొదలైన దరఖాస్తులు

Jobs: రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

RITES Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 170

ఇంజనీర్ (సివిల్)- 50

ఇంజనీర్ (మెకానికల్)- 30

ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 90

IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 482 జాబ్స్... ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఫ్రెషర్స్‌కి 175 జాబ్స్... రూ.50,000 వరకు జీతం

RITES Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 5

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 26

రాత పరీక్ష- తేదీలను త్వరలో వెల్లడించనున్న రైట్స్ లిమిటెడ్

విద్యార్హతలు- ఇంజనీర్ (సివిల్) పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంజనీర్ (మెకానికల్) పోస్టుకు మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయస్సు- 2020 నవంబర్ 1 నాటికి 40 ఏళ్ల లోపు

వేతనం- సుమారు రూ.35,152.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300.

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం

పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, నాగ్‌పూర్‌.

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

ఉత్తమ కథలు