ఆర్ఐటీఈఎస్(RITES )లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్(Engineer) పోస్టులు భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మొదట కేరళ(Kerala)లో పోస్టింగ్ ఇస్తారు.
ఆర్ఐటీఈఎస్(RITES )లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్(Engineer) పోస్టులు భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మొదట కేరళ(Kerala)లో పోస్టింగ్ ఇస్తారు. అయితే కంపెనీ అవసరాల మేరకు దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టు(Contract) కాల పరిమితి ఒక సంవత్సరం. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఖాళీలకు ఎంపికైన వారికి నెల వేతనం రూ .39,564గా నిర్ధారించారు. డిప్లొమా(Diploma) ఇంజనీర్ ఖాళీలకు ఎంపికైన వారికి రూ .32,479 చెల్లిస్తారు. మొత్తం 40 కాంట్రాక్టు ఇంజినీర్ పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పోస్టు
ఖాళీలు
అర్హతలు
ఇంజనీర్ (సివిల్)
40
సివిల్ ఇంజనీరింగ్‌లో ఈ, బీటెక్ చేసి ఉండాలి. ఆరు సంవత్సరాల పని అనుభవం ఉండాలి
విద్యార్హతలు..
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University)లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్(Btech), లేదా బీఎస్సీ చేసి ఉండాలి.
- అభ్యర్థులకు ఆరు సంవత్సరాల వృత్తి సంబంధిత అర్హత ఉండాలి.
- వృత్తి అర్హతలో డిజైన్, నిర్మాణం, పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, రోడ్డు, వంతెన, ఫ్లైఓవర్ విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
- సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉన్న అభ్యర్థులకు 12 సంవత్సరాల పోస్ట్ అర్హత ఉండాలి.
- డిప్లొమా అభ్యర్థులకు డిజైన్, నిర్మాణం, పర్యవేక్షణ, నాణ్యత(Quality) నియంత్రణ, పరిమాణ సర్వేయింగ్, రోడ్డు, వంతెన, ఫ్లైఓవర్ విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులలో కొందరిని షార్ట్ లిస్ట్ (Short List) చేస్తారు.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- ముందుగా అభ్యర్థి RITES నోటిఫికేషన్‌ను చదివి పోస్టుకు అర్హత ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- ఆన్లైన్లో దరఖాస్తు ఫాంలో విద్యార్హతలు, పని అనుభవం వివరాలు నమోదు చేయాలి.
- దరఖాస్తుఫాం నింపిన తరువాత రిజిస్ట్రేషన్(Registration) నంబర్‌తో కూడి అప్లికేషన్ ఫాం జనరేట్ అవుతుంది.
- అప్లికేషన్ హార్డు కాపీని ఒకటి అభ్యర్థి తన వద్దు దాచుకోవాలి.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు అవసరం అయితే తమ అప్లికేషన్(Application) ఫాంను అందించాలి.
- అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 19, 2021లోపు ఆన్లైన్(Online)లో సమర్పించాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.