చాలా మందికి విదేశాల్లో చదువుకోవాలని, పని చేయాలని ఉంటుంది. అయితే పరిమితులు, నిబంధన కారణంగా కొంత మందికే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు పరిమిత సంఖ్యలోనే విదేశీయులకు వీసాలు ఇస్తుంటాయి. అయితే బ్రిటన్‌కు వెళ్లాలనుకునే ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది యూకే ప్రభుత్వం. ఆ దేశంలో రెండేళ్లపాటు యూకేలో జీవించే లేదా పని చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించిన యూకే- ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రతి సంవత్సరం యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు 3,000 వీసాలు మంజూరు చేసేందుకు యూకే పీఎం రిషి సునాక్ అనుమతి ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన యువత యూకేలో నివసించడానికి, అక్కడ పని చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్, మొబిలిటీ పార్ట్నర్‌షిప్ ద్వారా ప్రయోజనం పొందిన మొదటి వీసా- నేషనల్ కంట్రీ భారతదేశం అని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది.
CBSE Exams: 12వ తరగతి ఎగ్జామ్ డేట్ షీట్ పై సీబీఎస్ఈ క్లారిటీ.. అది ఫేక్ అంటూ వివరణ
ఈ విషయానికి సంబంధించి యూకే ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశంతో యూకేకి లోతైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ఇంకా ఎక్కువ మంది భారతదేశ యువతకు ఇప్పుడు యూకేలో జీవించే అవకాశం లభించడం సంతోషకరమని పీఎంఓ ఆఫీస్ నోట్ పేర్కొంది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ, సమాజాలు ధనవంతులుగా మారే అవకాశం ఉందని ప్రకటన పేర్కొంది.
పీఎం అయ్యాక మొదటిసారి సునాక్‌ను కలిసిన మోదీ
ప్రస్తుతం యూకే- ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కన్‌ఫర్మ్ అయిందని యూకే పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. యూకే- ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద, యూకే సంవత్సరానికి 3,000 వీసాలను అందిస్తుంది. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల, డిగ్రీ పూర్తి చేసిన భారతీయ పౌరులు యూకేకి వచ్చి రెండేళ్లపాటు ఉండొచ్చు, పని చేసుకోవచ్చని పీఎంఓ ఆఫీస్ తెలిపింది G20 సమ్మిట్ 17వ ఎడిషన్ సందర్భంగా సునాక్‌ను మోదీ కలిసిన కొన్ని గంటల తర్వాత డౌనింగ్ స్ట్రీట్ రీడౌట్‌లో ఈ ప్రకటన వెలువడింది. గత నెలలో మొదటి భారతీయ సంతతికి చెందిన సునాక్ బ్రిటీష్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటిసారి మోదీని కలిశారు.
వాణిజ్య ఒప్పందానికి చర్చలు
మరోవైపు, యూకే ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతోంది . ఒకవేళ అంగీకారం జరిగితే.. ఒక యూరోపియన్ దేశంతో భారతదేశం చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది. వాణిజ్య ఒప్పందం ఇప్పటికే ఉన్న 24 బిలియన్ పౌండ్ల విలువైన యూకే-భారత్ వాణిజ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ అందించిన అవకాశాలను యూకే చేజిక్కించుకోవడానికి వీలు కల్పిస్తుంది. భారతదేశంతో మొబిలిటీ భాగస్వామ్యానికి సమాంతరంగా, ఇమ్మిగ్రేషన్ నేరస్థులను తొలగించే సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.