Home /News /jobs /

RGUKT NOTIFICATION RELEASED THESE ARE IMPORTANT DATES NS

RGUKT-CET 2020: ఏపీలో ఐఐఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

ట్రిపుల్ఐటీ నూజివీడు

ట్రిపుల్ఐటీ నూజివీడు

RGUKT ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 28న ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

    కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సైతం పది పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం RGUKT, AP ఆధ్వర్యంలో నిర్వహించే ఐఐఐటీల్లో ప్రవేశాలను పది మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు. పది పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ ప్రవేశాలు నిర్వహించడం ఇబ్బంది మారింది. ఈ నేపథ్యంలో కామన్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఐఐఐటీలో ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని RGUKT పాలకవర్గాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో RGUKT ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.

    వచ్చే నెల నవంబర్ 28న ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందు కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అదే రోజు ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 11 చివరి తేదీ అని తెలిపింది. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

    పూర్తి వివరాల కోసం-Direct Link  పై క్లిక్ చేయండి

    రూ. వేయి లేట్ ఫీజుతో నవంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 22 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసకునే అవకాశం కల్పించనున్నారు. ఓసీ విద్యార్థులకు రూ. 300, బీసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100ను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగ్రాం, ఆచార్య ఎన్జీ రంగా, శ్రీ వెంకటేశ్వర, వైఎస్సార్ యూనివర్సిటీల్లో 2/3 ఏళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను ఈ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. అందులో 50 మాథ్స్, 25 ఫిజిక్స్, 25 బయోలజీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 10th Class Exams, Basara IIIT

    తదుపరి వార్తలు