RGUKT Basara Admissions: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) బాసర ఆరు సంవత్సరాల సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించనున్నారు.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)-బాసర 2022-23 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్(Integrated) బీటెక్ ప్రోగ్రామ్లలో(B Tech Programme) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లకు అడ్మిషన్లు(Admissions) GPAలో మెరిట్, పదో తరగతి పరీక్షలలో ప్రతి సబ్జెక్టులో పొందిన గ్రేడ్(Grade) ఆధారంగా ఉంటాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ , జిల్లా పరిషత్, మునిసిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్(Grades) ఆధారంగా అడ్మిషన్లు(Admissions) కల్పించనున్నారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం స్థానికులకు (తెలంగాణ) రిజర్వ్ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్ రిజర్వ్ డ్ గా ఉన్నాయి.
ఈ 15 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (జూలై 1) ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 15గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
PH/CAP/NCC/Sports అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా జూలై 19గా నోటిఫికేషన్లో తెలిపారు. లై 30 సెలెక్ట్ అయిన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని ఆర్జీయూకేటీ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం https://www.rgukt.ac.in/ను సందర్శించాలి.
ఈ టెట్ ఫలితాలను జూలై 1 విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. జూన్ 29న టెట్ ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు. ఈ కీలో కొన్ని ప్రశ్నలకు మార్కులను కలుపగా.. మరికొన్ని ప్రశ్నలు డబుల్ సమాధాలను ఇచ్చారు. పేపర్ 1లో 4 మార్కులను కలపగా.. మరో 4 ప్రశ్నలకు రెండు సమాధానాలను గుర్తించారు. మొత్తంగా 8 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే.. మ్యాథమేటిక్స్ , సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కీలో నాలుగు మార్కులను కలుపగా.. మరో ప్రశ్నకు రెండు సమాధానాలను గుర్తించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.