Home /News /jobs /

RGUKT Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ విద్యాసంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. పూర్తి వివరాలివే

RGUKT Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ విద్యాసంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Jobs: నిరుద్యోగులకు నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT-IIT) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  నిరుద్యోగులకు నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT-IIT) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4, ఇతర పోస్టులకు ఫిబ్రవరి 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
  మొత్తం 59 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తదితర ఇంజనీరింగ్ విభాగాల్లో గెస్ట్ ఫాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
  -తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ తదితర సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాల్లోనూ గెస్ట్ ఫ్యాకల్టీని బర్తీ చేస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

  -గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈసీఈ, సివిల్, కెమికల్, ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
  -గెస్ట్ ల్యాబరేటరీ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 15 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈఈఈ, మెకానికల్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
  - సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, బీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

  ఎంపిక ఎలా..
  గెస్ట్ ఫాకల్టీ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
  Notification-Direct Link
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Basara IIIT, CAREER, Govt Jobs 2021, JOBS, Nirmal, Telangana

  తదుపరి వార్తలు