హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Level 6 Result 2022: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్‌ 6 ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

RRB NTPC Level 6 Result 2022: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్‌ 6 ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్‌ 6 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) తాజాగా విడుదల చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Secunderabad

  ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్‌ 6 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కమర్షియల్‌ అప్రెంటిస్‌, స్టేషన్‌ మాస్టర్‌ లెవల్‌ -6 పోస్టులకు 7109 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 1.26 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్షను జూలై 30న నిర్వహించారు. స్టేషన్‌ మాస్టర్‌ పోస్టుకు 841 మంది అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://rrbcdg.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.ఇదిలా ఉంటే.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D ఫేజ్ 3 పరీక్ష తేదీలను ప్రకటించింది. RRB గ్రూప్ D లెవెల్-1 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు rrbcdg.gov.in అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన నోటీసును చూసుకోవచ్చు. నోటీసు ప్రకారం.. ఫేజ్-III పరీక్ష(Phase 3 Exam) సెప్టెంబర్ 08 నుండి సెప్టెంబర్ 19, 2022 వరకు నిర్వహించబడుతుంది. RRB జారీ చేసిన నోటీసు ప్రకారం.. అభ్యర్థులు ఆగస్టు 30 నుండి పరీక్ష తేదీ అండ్ సెంటర్ ను వెబ్ సైట్(Web site) ద్వారా తెలుసుకోవచ్చు.
  Railway Jobs 2022: ఇంటర్ , డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..  RRB పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ జారీ చేస్తుంది. అభ్యర్థులుఅధికారిక సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 08 సెప్టెంబర్ 2022న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 4 నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ పరీక్ష దేశంలోని వివిధ నగరాల్లో నాలుగు RRCల ఈస్ట్ కోస్ట్ రైల్వే (భువనేశ్వర్), నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (గౌహతి), ఉత్తర రైల్వే (న్యూఢిల్లీ) మరియు దక్షిణ రైల్వే (చెన్నై) కోసం నిర్వహించబడుతుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, Railway jobs, Results, RRB

  ఉత్తమ కథలు