Home /News /jobs /

Software Jobs: 30 లక్షల సాఫ్ట్​వేర్ ఉద్యోగాలకు గండం.. ఉద్యోగాల తొలగింపుపై కంపెనీల దృష్టి

Software Jobs: 30 లక్షల సాఫ్ట్​వేర్ ఉద్యోగాలకు గండం.. ఉద్యోగాల తొలగింపుపై కంపెనీల దృష్టి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే ఏడాది ముగిసేలోగా పలు ప్రముఖ సాఫ్ట్​వేర్ సంస్థలు దాదాపు 30లక్షల మంది ఉద్యోగులను తొలగిస్తాయని ఓ నివేదిక తెలిపింది. ఆటోమేషన్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది.

కరోనా తరువాత ఉద్యోగాల విషయంలో కంపెనీల దృక్పథం మారింది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో టెక్ రంగంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత ఉంటుందని ఓ నివేదిక అంచనా వేసింది. వచ్చే ఏడాది ముగిసేలోగా టాప్ సాఫ్ట్​వేర్ సంస్థలు 30లక్షల మంది ఉద్యోగులను తొలగిస్తాయని స్పష్టం చేసింది. టెక్ రంగంలో ఆటోమేషన్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ సాఫ్ట్​వేర్ సంస్థల్లో 1.6 కోట్ల మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 30లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని నివేదిక వెలువడింది. ముఖ్యంగా తక్కువ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు, బీపీవో రోల్స్ పని చేస్తున్న వారిపైనే వేటు పడుతుందని నాస్కామ్​ తన రిపోర్ట్​లో స్పష్టం చేసింది. ప్రస్తుతం సాఫ్ట్​వేర్ రంగంలో 90 లక్షల మంది లోస్కిల్డ్​, బీపీవో రోల్స్​లో ఉన్నారని, వీరిలో 30 లక్షల మంది ఉద్యోగాలు 2022 ముగిసే నాటికి పోతాయని నాస్కామ్ నివేదిక అంచనా వేసింది. రొబోట్ ప్రాసెస్​ ఆటోమేషన్​ (ఆర్​పీఏ) వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేసింది. దాదాపు 7 లక్షల ఉద్యోగుల స్థానాన్ని రొబోటిక్​ ప్రాసెస్​ ఆటోమేషన్ భర్తీ చేస్తుందట. కాగా ఆర్​పీఏ వల్ల ఇప్పటికే అమెరికాలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటీవల ప్రకటించింది.
China Education System: విద్యలో చైనా వెనుకే అమెరికా.. అగ్రరాజ్యం ఎందుకు వెనుకబడుతోంది?
ISRO online courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించనున్న ఇస్రో.. దరఖాస్తు ఎలా చేయాలంటే..

“’టీసీఎస్‌​, ఇన్ఫోసిస్​, విప్రో, హెచ్​సీఎల్​, టెక్​ మహీంద్రాతో పాటు మరికొన్ని సంస్థలు 30 లక్షల మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేస్తున్నాయి. లోస్కిల్డ్​ రోల్స్​లోని ఉద్యోగులకు 2022లోగా ఉద్వాసన పలకాలని భావిస్తున్నాయి. దీనివల్ల 100 బిలియన్ డాలర్ల వేతనాలు అన్నింటికి ఆదా అవుతాయి. మరోవైపు ఆర్​పీఏను విజయవంతంగా అమలు చేస్తే 10 బిలియన్ డాలర్ల లాభం కూడా వస్తుంది. రొబోలు అయితే రోజుకు 24 గంటలు పని చేస్తాయి. ఉద్యోగి 10 రోజుల్లో చేసే పనిని ఆర్​పీఏ ద్వారా ఒక్క రోజులోనే పూర్తవుతుందని అంచనాలు ఉన్నాయి” అని నాస్కామ్ నివేదిక వెల్లడించింది.

సాఫ్ట్​వేర్​ రంగంలో వినియోగించే ఈ రొబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ ఫిజికల్ రొబోట్​లు కాదు. ఇవి ప్రత్యేకమైన సాఫ్ట్​వేర్ అప్లికేషన్లు. నిత్యం చేయాల్సిన పనులను అవి ఆటోమేటిక్​గా చేసేస్తాయి. ఉద్యోగులు ఏం పని చేస్తారో ప్రోగ్రామ్​ల ద్వారా అవి నిరంతరాయంగా అవే పని చేస్తాయి.

మరోవైపు కరోనా ప్రభావం కారణంగా దేశంలో చాలా రంగాల్లోనూ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.. చాలా రంగాలు నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ముగియకపోతే మరింత మందిపై తీవ్ర ప్రభావాలు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ శాతం మరింత పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Covid jobs, IT Employees, Software

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు