Home /News /jobs /

REPORT INDIANS RELUCTANT TO FIND A SUITABLE JOB YOUNG PEOPLE GIVING UP LOOKING FOR A JOB GH VB

Stop Looking For Jobs: యువతలో మార్పు.. ఉద్యోగం వెతకడం మానేస్తున్న యువత.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన డేటా ప్రకారం.. సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో విసుగు చెంది.. లక్షలాది మంది భారతీయులు, ప్రత్యేకించి మహిళలు పూర్తిగా వర్క్‌ఫోర్స్‌ నుంచి నిష్క్రమిస్తున్నారు.

ఇంకా చదవండి ...
భారతదేశంలో ఉద్యోగ కల్పన సమస్య(Job Creation Problem) ముప్పుగా మారుతోంది. దేశంలో పని కోసం వెతకని వారి సంఖ్య పెరుగుతోంది. ముంబైలోని(Mumbai) ఒక ప్రైవేట్ రీసెర్చ్(Private Research) సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(Indian Economy) (CMIE) విడుదల చేసిన డేటా ప్రకారం.. సరైన ఉద్యోగం(Job) దొరక్కపోవడంతో విసుగు చెంది.. లక్షలాది మంది భారతీయులు(Indians), ప్రత్యేకించి మహిళలు(Women's) పూర్తిగా వర్క్‌ఫోర్స్‌(Workforce) నుంచి నిష్క్రమిస్తున్నారు.

అర్హులైన వారిలో 9 శాతానికే ఉపాధి
ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ(World's Fastest-Expanding Economies)లలో ఒకదానిగా నిలిచేందుకు యువతపై ఆధారపడిన భారతదేశంలో తాజా సంఖ్యలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. 2017 నుంచి 2022 మధ్య మొత్తం కార్మిక భాగస్వామ్య రేటు 46 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. మహిళల్లో ఈ రేటు మరింత ఎక్కువగా ఉంది. దాదాపు 21 మిలియన్ల మంది వర్క్‌ఫోర్స్‌ నుంచి అదృశ్యమయ్యారు. అర్హులైన జనాభాలో కేవలం 9 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. లేదా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. CMIE ప్రకారం.. దేశంలో పనిచేసేందుకు చట్టబద్దమైన వయసున్న 9 కోట్ల మంది భారతీయులలో సగానికి పైగా పనిచేయడానికి సముఖంగా లేరు. ఈ సంఖ్య యూఎస్‌, రష్యా జనాభా కలిపితే దానికి సమానం.

Moto G52: బడ్జెట్ ధరలో మోటో జీ52స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

చిన్న ఉద్యోగానికీ తీవ్రపోటీ
ఆర్థికవేత్త కునాల్ కుందు ఓ సంస్థతో మాట్లాడుతూ.. ‘నిరుత్సాహానికి గురైన కార్మికులు ఎక్కువగా ఉండటంతో.. యువత నుంచి అందే ప్రయోజనాలు భారతదేశం పొందే అవకాశం లేదు. కె-ఆకారపు వృద్ధి మార్గం అసమానతకు మరింత ఆజ్యం పోస్తూ భారతదేశం మధ్య-ఆదాయ ఉచ్చులోనే ఉండిపోయే సూచనలు ఉన్నాయి’ అని చెప్పారు. ఉద్యోగాల సృష్టికి సంబంధించి భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించారు. జనాభాలో మూడింట రెండు వంతుల మంది 15- 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఉన్నారు. ప్రతి చిన్న పనికీ పోటీ తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వంలో స్థిరమైన స్థానాల కోసం మామూలుగా లక్షలాది దరఖాస్తులు వస్తాయి. టాప్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీటు పొందడం కోసమూ పోటీ తీవ్రంగా ఉంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయే సూచనలు..
మెకిన్‌సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ 2020 నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారతదేశం కనీసం 90 మిలియన్ల కొత్త వ్యవసాయేతర ఉద్యోగాలను సృష్టించాలి. అందుకు 8 శాతం నుంచి 8.5 శాతం వార్షిక జీడీపీ వృద్ధి అవసరం. యువకులకు పని కల్పించడంలో విఫలమైతే భారతదేశం అభివృద్ధి చెందిన దేశ స్థాయికి దూరమవుతుంది. ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసి Apple, Amazon వంటి కంపెనీలను ఆకర్షించినా.. భారతదేశంలో డిపెండెన్సీ నిష్పత్తి త్వరలో పెరగడం ప్రారంభమవుతుంది. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను పొందే అవకాశం దేశం కోల్పోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే కాలం గడిచే కొద్దీ భారతీయులు వృద్ధులు అవుతారే కానీ ధనవంతులు కాదు.

కార్మికుల క్షీణత మహమ్మారి కంటే ముందే ఉంది. 2016లో నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం చాలా కరెన్సీ నోట్లను నిషేధించిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అమ్మకపు పన్ను అమలులోకి రావడం మరో సవాలుగా మారింది. అనధికారిక ఆర్థిక వ్యవస్థ నుండి అధికారిక ఆర్థిక వ్యవస్థకు మారడానికి భారతదేశం చాలా కష్టపడింది.

మహిళలకు అవకాశాలు తక్కువ
వర్క్‌ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గుదలకు సంబంధించిన వివరణలు మారుతూ ఉంటాయి. నిరుద్యోగ భారతీయులు విద్యార్థులు లేదా గృహిణులు. వీరిలో చాలా మంది అద్దె ఆదాయం, వృద్ధ కుటుంబ సభ్యుల పెన్షన్‌లు , ప్రభుత్వ పథకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వేగవంతమైన సాంకేతిక మార్పుల ప్రపంచంలో మార్కెట్‌ చేయగల నైపుణ్యంలో వెనుకబడి ఉన్నారు. మహిళలకు కొన్నిసార్లు ఇంట్లో భద్రత ఇతర కారణాలు ఉంటాయి. వారు భారతదేశ జనాభాలో 49 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్పటికీ ఆర్థిక ఉత్పత్తిలో కేవలం 18 శాతం మాత్రమే భాగస్వామ్యం ఉంది.

Flipkart Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే

ఇది ప్రపంచ సగటులో సగం. మహిళలు ఎక్కువ సంఖ్యలో లేబర్ ఫోర్స్‌లో చేరరని, వారికి ఉద్యోగాలు ఎక్కువగా లభించవని CMIE ప్రతినిధి మహేష్ వ్యాస్ తెలిపారు. మహిళల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచే ప్రణాళికలతో సహా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం.. ఉన్నత విద్య, వృత్తిని అభ్యసించడానికి మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా శ్రామిక శక్తి భాగస్వామ్యం మెరుగవుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Indian Economy, JOBS, Women, Workforce

తదుపరి వార్తలు