బ్యాంక్లో ఉద్యోగాలు(Bank Jobs) చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. రెప్కో బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్(Recruitment Drive) కోసం దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థులు ఆన్లైన్ మోడ్లో(Online Mode) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకోవడానికి చివరి తేదీ 25 నవంబర్ 2022గా నిర్ణయించబడింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అర్హతలు:
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్లో 50 జూనియర్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అభ్యర్థులు రూ. 900 ఫీజు చెల్లించాలి. అయితే SC / ST / PWD / Ex-Servicemen అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
వేతనం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,900 నుండి రూ.47,920 వరకు జీతం ఇవ్వబడుతుంది.
దరఖాస్తు విధానం ఇలా..
-అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
-తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-వ్యక్తిగత వివరాలతో పాటు.. ఈ మెయిల్, మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
-తర్వాత అప్లికేషన్ నంబర్ అండ్ పాస్ వర్డ్ మొబైల్ కు సందేశం ద్వారా వస్తుంది.
-వాటిని ఉపయోగించి లాగిన్ కావాలి. దీనిలోనే వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 200 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది . 2 గంటల వ్యవధిలో 200 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
పరీక్ష సరళి..
1. రీజనింగ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
3. జనరల్ అవేర్నెస్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
4. ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
5. కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS