Reliance Jio Internship Program | డిగ్రీ పాసయ్యారా? డిప్లొమా పూర్తి చేశారా? బీటెక్ చదివారా? రిలయెన్స్ జియో వేర్వేరు అంశాల్లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.
విద్యార్థులకు శుభవార్త. ఆసక్తి ఉన్న అంశాల్లో మరింత నైపుణ్యం సాధించేందుకు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ రూపంలో రిలయెన్స్ జియో అవకాశం ఇస్తోంది. రిలయెన్స్ జియో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2020 కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు జియో అధికారిక వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ లాంటి కోర్సులు పాసైన విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో జాయిన్ కావొచ్చు. ఇప్పటివరకు థియరీ నేర్చుకున్నవారు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పొందొచ్చు. ఇండస్ట్రీలోని నిపుణుల సహకారంతో మెళకువలు నేర్చుకోవచ్చు.
Jio Internship Program: అర్హతలు ఇవే...
ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా ఇన్స్టిట్యూట్లో ఫుల్ టైమ్ డిగ్రీ లేదా డిప్లొమా పాసై ఉండాలి. మీ విద్యా సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌కు రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసేముందు https://careers.jio.com/ వెబ్సైట్లో నియమ నిబంధనలన్నీ చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి. ప్రస్తుతం ఏఏ అంశాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.