హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RIL 44th AGM: ఈ ఏడాది నుంచే జియో ఇనిస్ట్యూట్ కార్యకలాపాలు.. ప్రకటించిన నీతా అంబానీ.. ప్రత్యేకతలివే

RIL 44th AGM: ఈ ఏడాది నుంచే జియో ఇనిస్ట్యూట్ కార్యకలాపాలు.. ప్రకటించిన నీతా అంబానీ.. ప్రత్యేకతలివే

వివరాలను వెల్లడిస్తున్న నీతా అంబానీ

వివరాలను వెల్లడిస్తున్న నీతా అంబానీ

నిన్న జరిగిన రిలయన్స్ ఏజీఎంలో నీతా అంబానీ జియో ఇనిస్ట్యూట్, స్కాలర్ షిప్ లపై కీలక ప్రకటన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన 44వ AGMను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జియో ఇనిస్ట్యూట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. వరల్డ్ క్లాస్ రీసెర్చ్, ఇన్నొవేషన్ కు ప్రపంచ స్థాయి వేధికగా జియో ఇనిస్ట్యూట్ ను తీర్చిదిద్దినట్లు నీతా అంబానీ వెల్లడించారు. భారత్ ను రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు గ్లోబల్ లీడర్లను ఈ సంస్థ ద్వారా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఏడాది నావీ ముంబాయిలోని జియో ఇనిస్ట్యూట్ క్యాంపస్ లో అకాడమిక్ సెషన్స్ ప్రారంభిస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,140 కోట్లు ఖర్చు చేశామన్నారు. కరోనా-19 సపోర్ట్, రూరల్ ట్రాన్సఫర్మేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్స్ట్, డిజాస్టర్ రెస్పాన్స్ కింద ఈ నిధులు ఖర్చు చేశామన్నారు.

ఫ్రంట్‌లైన్ కార్మికులకు సేవ చేయడానికి ప్రతిరోజూ 1,00,000 పీపీఈ కిట్లు మరియు ముసుగులు ఉత్పత్తి చేయడానికి గుజరాత్‌లోని సిల్వాస్సాలో ఒక ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్రలోని నావీ ముంబైలో 52 ఎకరాల విస్తీర్ణంలో జియో ఇనిస్ట్యూట్ ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ష్ అందించనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.

ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు:

-రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం కోసం ఈ స్కాలర్ షిప్ ను అందించనున్నారు.

-కఠినమైన ఎంపిక ప్రక్రియ నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులను స్కాలర్ షిప్ అందించడానికి ఎంపిక చేస్తారు.

-40 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, మరో 40 మంది పోస్టు గ్రాడ్యుయేట్లను స్కాలర్ షిప్ అందించడం కోసం ఎంపిక చేయనున్నారు.

-అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 4 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షల మొత్తం వరకు స్కాలర్ షిప్ ను కోర్సు ముగిసే వారకు అందించనున్నారు.

-మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందించనున్నారు. మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు.

-అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుండి దరఖాస్తుదారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ప్రత్యేకంగా సామర్థ్యం ఉన్న అభ్యర్థుల -దరఖాస్తులను ప్రోత్సహిస్తామని వెల్లడించింది. అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో, వార్షిక -గృహ ఆదాయం రూ. 10 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారికి మెరిట్ ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

First published:

Tags: Nita Ambani, Reliance Foundation, RIL

ఉత్తమ కథలు