హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Reliance: రిలయన్స్ ఫౌండేషన్ ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోషిప్‌ ప్రారంభం..వైటల్ వాయిస్ ప్లాట్‌ఫామ్ సాయంతో ముందడుగు

Reliance: రిలయన్స్ ఫౌండేషన్ ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోషిప్‌ ప్రారంభం..వైటల్ వాయిస్ ప్లాట్‌ఫామ్ సాయంతో ముందడుగు

ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోషిప్‌

ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోషిప్‌

 WomenLead India Fellowship : వివిధ రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న భారత మహిళా నాయకులకు మద్దతు ఇచ్చేందుకు దీనికి రూపలకల్పన చేశారు. ఉమెన్‌లీడ్ ఇండియా అనేది 10 నెలల సుదీర్ఘ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

WomenLead India Fellowship : సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న మహిళలకు స్పెషల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది రిలయన్స్ ఫౌండేషన్(Reliance Foundation). నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ వైటల్ వాయిస్ గ్లోబల్ పార్టనర్‌షిప్‌తో కలిసి ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోషిప్‌(WomenLead India Fellowship)ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించింది. వివిధ రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న భారత మహిళా నాయకులకు మద్దతు ఇచ్చేందుకు దీనికి రూపలకల్పన చేశారు. ఉమెన్‌లీడ్ ఇండియా అనేది 10 నెలల సుదీర్ఘ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ కొత్త ప్రోగ్రామ్‌లో భాగం కావాలనుకునే వారు vitalvoices.org/program/womenleadindiafellowship/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు. వివిధ రంగాల్లో సామాజిక మార్పు కోరుకునే మహిళల నాయకత్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ఈ ఫెలోషిప్ లక్ష్యం. ఆ రంగాలు, నిర్దేశిత లక్ష్యాలు ఏవో చూద్దాం.


* గ్రామీణ పరివర్తన (Rural transformation)
గ్రామీణ వర్గాల ప్రధాన ఆందోళనలైన ఆర్థిక సాధికారత, పోషకాహార భద్రత, నీటి భద్రత, జీవావరణ శాస్త్రం, స్థానిక సంస్థల పాలనా సామర్థ్యం, మహిళా సాధికారత వంటి వాటిని పరిష్కరించడానికి సమగ్ర, స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడం.


* విద్య (Education)

బాల్య సంరక్షణ, విద్య, ఆదాయం, లింగం, సామాజిక, భౌగోళిక పరమైన అసమానతలను పరిష్కరించడం; అన్ని స్థాయిలలో అందించే విద్యా సేవల నాణ్యతను మెరుగుపరచడం; విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం లేదా బలోపేతం చేయడం.


* అభివృద్ధి కోసం క్రీడలు (Sports for development)

గ్రామీణ, అట్టడుగు వర్గాలకు క్రీడలను విస్తరించడం ద్వారా, క్రీడలను మాధ్యమంగా ఉపయోగించడం ద్వారా భారతదేశంలోని యువతలో క్యారెక్టర్, లీడర్‌షిప్ స్కిల్స్ పెంపొందించడం.


ఎంత కష్టమొచ్చెనే : ప్రియుడితో భార్య జంప్..కొడుకుని ఎత్తుకొని తండ్రి రిక్షా సవారీ* కళలు, సంస్కృతి, వారసత్వం (Arts, culture and heritage)

భారతదేశ కళలు, సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం; దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం; యువ తరానికి సంబంధించిన కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం.పైన పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగాల్లో సామాజిక మార్పులు అమలు చేయడంలో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్న మహిళా నాయకులు ఈ ఫెలోషిప్‌కు అర్హులు. ఈ ఫెలోషిప్ ఇనాగరల్ కోహోర్ట్‌లో పాల్గొనడానికి ఎంపిక చేసే 50 మంది మహిళా నాయకులకు లీడర్‌షిప్ కెపాసిటీ, స్కిల్ డెవలప్‌మెంట్‌ను అందిస్తారు. ఎంపికైన వారు మెంటారింగ్, పీర్-టు-పీర్ ఎంగేజ్‌మెంట్ సపోర్ట్ పొందుతారు.


"మహిళలు తమను తాము మాత్రమే కాకుండా, వారి కుటుంబాలు, సంఘాలను కూడా శక్తివంతం చేసే సమిష్టి, సృజనాత్మక శక్తి అని మేము విశ్వసిస్తాం. స్త్రీలు స్త్రీలపై ఆధారపడినప్పుడు, కలిసి పెరిగినప్పుడు, వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడంలో సహాయపడే నెట్‌వర్క్, నాయకత్వ వ్యవస్థను నిర్మిస్తారు. మహిళల్లో ఈ నాయకత్వాన్ని నడిపించడం, మద్దతు ఇవ్వడం మా లక్ష్యం. రిలయన్స్ ఫౌండేషన్, వైటల్ వాయిస్‌ సంయుక్తంగా అందించే ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోషిప్ భారతదేశంలో సామాజిక మార్పును తీసుకురావడంలో ముందంజలో ఉండే స్ఫూర్తిదాయకమైన మహిళా నాయకులను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన దశ” అని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు.


వైటల్ వాయిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ & CEO అలీస్ నెల్సన్ మాట్లాడుతూ.. రిలయన్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో భారతదేశ తరువాతి తరం మహిళా నాయకుల కోసం ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు.


పూర్తి నిధులతో స్పాన్సర్‌షిప్ చేసే ఈ 10 నెలల ప్రోగ్రామ్‌కు మహిళలను వివిధ రంగాల్లో అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉమెన్‌లీడ్ ఇండియా ఫెలోస్‌కు ఎకనామిక్ ఎంపవర్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్ సెక్టార్ లీడర్స్, చేంజ్ మేకర్స్.. వంటి ట్రాక్‌లలో ఒకదానిపై మెంటార్ చేస్తారు.


First published:

Tags: Reliance Foundation, WOMAN

ఉత్తమ కథలు