హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Reliance AGM 2022: విస్తరణ దిశగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌.. జియో ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ ప్రారంభం..

Reliance AGM 2022: విస్తరణ దిశగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌.. జియో ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ ప్రారంభం..

Reliance AGM 2022: విస్తరణ దిశగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌.. జియో ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ ప్రారంభం..

Reliance AGM 2022: విస్తరణ దిశగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌.. జియో ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ ప్రారంభం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన 45వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ప్రారంభించింది. ఆర్‌ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రసంగం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) తన 45వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ప్రారంభించింది. ఆర్‌ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రసంగం చేశారు. రాబోయో రెండు నెలల్లోపే ఢిల్లీ, ముంబై(Mumbai), కోల్‌కతా, చెన్నై(Chennai) మహానగరాలతో సహా పలు కీలక నగరాల్లో జియో 5జీని(Jio 5G) ప్రారంభిస్తామని, అనంతరం నెలవారీగా 5జీ సర్వీసులను ఇతర ప్రాంతాలకు పెంచాలని ప్లాన్ చేస్తున్నామని అంబానీ అన్నారు. 18 నెలల లోపు దేశంలోని అన్ని ప్రాంతాలకు జియో 5జీని విస్తరించనున్నట్లు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ నెట్ వర్క్ ను జియో కలిగి ఉంటుందన్నారు.


TSLPRB Constable Key: కానిస్టేబుల్ పరీక్షకు 91 శాతం హాజరు.. ప్రాథమిక కీ, ఎస్సై ఫలితాలు ఎప్పుడంటే..


రిలయన్స్ రిటైల్ చైర్‌పర్సన్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ రిటైల్ కోసం ఓప్రకటన చేశారు. ఈ సంవత్సరం మేము ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వ్యాపారాన్ని ప్రారంభిస్తామని, ప్రతి భారతీయుని రోజువారీ అవసరాలను తీర్చే అధిక నాణ్యత, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, వాటిని అందించడం ఈ వ్యాపారం ముఖ్య లక్ష్యమని ఇషా అంబానీ తెలిపారు. మాడ్యులర్ డిజైన్, బెస్ట్-ఇన్-క్లాస్ ఆటోమేషన్‌తో విస్తృతమైన సప్లై చైన్ నెట్‌వర్క్‌ను నిర్మించామని, మేము సంవత్సరంలో 1,50,000 కంటే ఎక్కువ మందికి ఉపాధిని కల్పించామని, దీంతో మా ఉద్యోగుల సంఖ్య 3,60,000కి పెరిగిందని ఇషా అంబానీ తెలిపారు. WhatsApp అండ్ Jio Mart మధ్య కొత్త ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీని కింద జియో మార్ట్‌కు వాట్సాప్ పే సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.రిలయన్స్ రిటైల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో 4.5 బిలియన్ విజిట్‌లు నమోదయ్యాయని.. గత ఏడాదితో పోలిస్తే ఇది 2.3 రెట్లు పెరిగిందని ఇషా అంబానీ చెప్పారు. రిలయన్స్ రిటైల్ యొక్క డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ దాదాపు ఆరు లక్షల ఆర్డర్‌లు నమోదువుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కూడా గతేడాది కంటే 2.5 రెట్లు అధిక వృద్ధి నమోదైందనన్నారు. రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం ఆసియాలోని టాప్ టెన్ రిటైలర్లలో ఒకటిగా నిలించిందని పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ ఫిజికల్ స్టోర్లు అండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు 200 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ కస్టమర్లకు సేవలందించాయని.. ఇది UK, ఫ్రాన్స్ మరియు ఇటలీల ఉమ్మడి జనాభాకు సమానమని ఇషా అంబానీ చెప్పారు. రిలయన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దేశంలోని 7000 నగరాల్లో 8700 స్టోర్లను కలిగి ఉండబోతోందని ఇషా అంబానీ చెప్పారు.
రిలయన్స్ ఫౌండేషన్ సేవలు 60,000 గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో 63 మిలియన్ల మంది ప్రజలకు చేరిందని.. 14.5 మిలియన్లకు పైగా గ్రామీణ ప్రజలు మెరుగైన జీవనోపాధిని సంపాదించడానికి .. మెరుగైన జీవితాలను గడపడానికి తాము సహకరించినట్లు తెలిపారు.
జియో ఇనిస్టిట్యూట్..
జియో ఇన్స్టిట్యూట్ ఈ సంవత్సరం అకడమిక్ సెషన్లను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం గత నెలలో 120 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌గా విస్తరించేందుకు నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్‌ను ప్రారంభిస్తాం అని ఇషా అంబానీ తెలిపారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విస్తరణగా రిలయన్స్ ఫౌండేషన్ - జియో ఇన్స్టిట్యూట్ అండ్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా రెండు సంస్థలను ప్రారంభించినట్లు ఇషా అంబానీ ప్రకటించారు.
ఒలింపిక్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు , జాతీయ క్రీడలలో మా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడానికి రిలయన్స్ ఫౌండేషన్ ఇటీవల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని ఇషా అంబానీ చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా తాము 2024లో పారిస్ లో జరగబోయే సమ్మర్ ఒలంపిక్స్ లో తమ వంతు భాగస్వామ్యం కల్పించడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Akash Ambani, Career and Courses, Isha Ambani, JOBS, Reliance, Reliance Digital, Reliance Industries

ఉత్తమ కథలు