RIL 44 వ AGM ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ష్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జియో ఇనిస్ట్యూట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. వరల్డ్ క్లాస్ రీసెర్చ్, ఇన్నొవేషన్ కు ప్రపంచ స్థాయి వేధికగా జియో ఇనిస్ట్యూట్ ను తీర్చిదిద్దామన్నారు. భారత్ ను రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు గ్లోబల్ లీడర్లను ఈ సంస్థ తీర్చిదిద్దుతుందన్నారు. ఈ ఏడాదిలో నావీ ముంబాయిలోని క్యాంపస్ లో అకాడమిక్ సెషన్స్ నిర్వహిస్తామన్నారు.
ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు:
-రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం.
-కఠినమైన ఎంపిక ప్రక్రియ నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులను స్కాలర్ షిప్ అందించడానికి ఎంపిక చేస్తారు.
-40 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, మరో 40 మంది పోస్టు గ్రాడ్యుయేట్లను స్కాలర్ షిప్ అందించడం కోసం ఎంపిక చేయనున్నారు.
-అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 4 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షల మొత్తం వరకు స్కాలర్ షిప్ ను కోర్సు ముగిసే వారకు అందించనున్నారు.
-మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందించనున్నారు. మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు.
-అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుండి దరఖాస్తుదారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ప్రత్యేకంగా సామర్థ్యం ఉన్న అభ్యర్థుల -దరఖాస్తులను ప్రోత్సహిస్తామని వెల్లడించింది. అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో, వార్షిక -గృహ ఆదాయం రూ. 10 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారికి మెరిట్ ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.