నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించినట్టు గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

news18-telugu
Updated: June 7, 2020, 11:00 PM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 ఏకలవ్య గురుకుల స్కూల్స్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించినట్టు గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: June 7, 2020, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading