ఇండియన్ ఆర్మీ(Indian Army)లో సేవలు అందించాలనుకునే మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్. మహిళా అగ్నివీర్(Agniveer) 2022 రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. బెంగళూరు(Bengaluru)లోని మిలిటరీ పోలీస్ కార్ప్స్‌లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్ట్ కోసం ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.
ఆర్మీలో మహిళా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్స్ 2022 ఆగస్టు 9న ప్రారంభమయ్యాయి. ఇందుకు తుది గడువు సెప్టెంబరు 7 వరకు ఉంది. 17.5, 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళా అభ్యర్థులు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కింద అందుబాటులో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, లక్షద్వీప్, మహే వంటి కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మహిళా అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్మీ అగ్నివీర్ 2022- ముఖ్యమైన వివరాలు
పోస్ట్- అగ్నివీర్ జనరల్ డ్యూటీ, మిలిటరీ పోలీస్
రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తేదీ- 2022, ఆగస్టు 9
అప్లై చేయడానికి చివరి తేదీ- 2022, సెప్టెంబర్ 7
అడ్మిట్ కార్డ్ విడుదలయ్యే తేదీ- 2022, అక్టోబర్ 12
ర్యాలీ తేదీలు- నవంబర్ 1 నుంచి 3 వరకు
అర్హత వయసు - 17.5 నుంచి 23 సంవత్సరాలు
విద్యార్హత- 45 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు
ఎలా దరఖాస్తు చేయాలి..?
స్టెప్- 1: ముందు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ఓపెన్ చేయండి.
స్టెప్- 2: హోమ్‌పేజీలో 'అగ్నిపథ్' ట్యాబ్ కింద ఉన్న 'Register or Apply Online' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్- 3: పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ వివరాలు, పేరు.. వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి.
స్టెప్- 4: అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
స్టెప్- 5: అన్ని వివరాలు చెక్ చేసుకొని, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ర్యాలీకి రిజిస్ట్రేషన్స్ తప్పనిసరి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, 2022 నవంబర్ 12న భారత సైన్యం అగ్నివీర్ ర్యాలీ కోసం అడ్మిట్ కార్డ్‌లను జారీ చేస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, తమ రిజిస్టర్డ్ ఇమెయిల్ ID నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Agniveer, Army jobs, JOBS