హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Doordarshan Recruitment: దూరదర్శన్ లో ఉద్యోగాలు.. వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, న్యూస్‌ రీడర్ పోస్టులు.. వివరాలిలా..

Doordarshan Recruitment: దూరదర్శన్ లో ఉద్యోగాలు.. వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, న్యూస్‌ రీడర్ పోస్టులు.. వివరాలిలా..

Doordarshan Recruitment: దూరదర్శన్ లో ఉద్యోగాలు.. వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, న్యూస్‌ రీడర్ పోస్టులు.. వివరాలిలా..

Doordarshan Recruitment: దూరదర్శన్ లో ఉద్యోగాలు.. వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, న్యూస్‌ రీడర్ పోస్టులు.. వివరాలిలా..

Doordarshan Recruitment: దూరదర్శన్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాజువల్‌ వీడియో ఎడిటర్‌, క్యాజువల్ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌, క్యాజువల్ ప్రొడ్యూజర్‌, క్యాజువల్ వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, క్యాజువల్ న్యూస్‌ రీడర్, క్యాజువల్ న్యూస్‌ రిపోర్టర్‌ వంటి పోస్టులను భర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

దూరదర్శన్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాజువల్‌ వీడియో ఎడిటర్‌, క్యాజువల్ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌, క్యాజువల్ ప్రొడ్యూజర్‌, క్యాజువల్ వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌, క్యాజువల్ న్యూస్‌ రీడర్, క్యాజువల్ న్యూస్‌ రిపోర్టర్‌(Reporter) వంటి పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియం సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోనున్న దూరదర్శన్‌ కేంద్ర రీజనల్ న్యూస్‌ యూనిట్‌ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

IT Companies: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఏం జరిగిందంటే..

మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య 36

విభాగాల వారీగా ఇలా..

1. క్యాజువల్‌ వీడియో ఎడిటర్‌- 07

అర్హతలు.. ఇంటర్, ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ లో డిగ్రీ లేదా డిప్లామా చేసి ఉండాలి. 2 సంవత్సరాల పని అనుభవం కూడా అవసరం.

వయో పరిమితి.. 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం.. ప్రతీ రోజు షిప్ట్ వారీగా జీతం చెల్లిస్తారు. ఒక్క షిప్ట్ కు రూ.1000 చెల్లిస్తారు.

2. క్యాజువల్ ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌-12

అర్హతలు..

డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జర్నలిజంలో డిప్లామా లేదా డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండాలి. న్యూస్ ఆర్గనైజేషన్ లో మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వయో పరిమితి.. 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం.. ఒక్క షిప్ట్ కు రూ.1600 చెల్లిస్తారు.

3.క్యాజువల్ ప్రొడ్యూజర్‌ -05

అర్హతలు.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టీవీ అండ్ రేడియో విభాగంలో డిప్లామాల లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అంతే కాకుండా మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి..  25 నుంచి 50 ఏళ్ల మధ్య

జీతం..  ఒక్క షిప్ట్ కు రూ.1250 చెల్లిస్తారు.

Expensive Schools: ఆ పాఠశాలలో వార్షిక ఫీజు రూ. కోటిన్నర.. ఒక్క విద్యార్థికి 4 గురు ఉపాధ్యాయులు.. ఖరీదైన పాఠశాలలు ఇవే..

4. క్యాజువల్ వెబ్‌సైట్‌ అసిస్టెంట్‌-04

మాస్ మీడియా కమ్యూనికేషన్ లో డిగ్రీ లేదా డిప్లామా కలిగి ఉండాలి. ఒడియా అండ్ ఇంగ్లీష్ లో టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వయో పరిమితి.. 21 నుంచి 50 ఏళ్ల మధ్య

జీతం.. ఒక్క షిప్ట్ కు రూ.1000 చెల్లిస్తారు.

5. క్యాజువల్ న్యూస్‌ రీడర్-06

ఒడియా భాష స్పష్టంగా మాట్లాడాలి. డిగ్రీతోపాటు.. కరెంట్ అఫైర్స్ పై మంచి అవగాహన ఉండాలి. జర్నలిజంలో అనుభవం కూడా తప్పనిసరి.

వయో పరిమితి.. 21 నుంచి 40 ఏళ్ల మధ్య

జీతం.. ఒక్క షిప్ట్ కు రూ.1100 చెల్లిస్తారు.

మల్టిఫుల్ బులెటెన్ లో రూ.1250, 3 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లకు రూ.1600 చెల్లిస్తారు.

6. క్యాజువల్ న్యూస్‌ రిపోర్టర్‌-02

మాస్ మీడియో కమ్యూనికేషన్ లో డిప్లామాల లేదా డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయో పరిమితి.. 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం.. ఒక్క షిప్ట్ కు రూ.1250, 3 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లకు రూ.1600 చెల్లిస్తారు.

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

దరఖాస్తు ఇలా.. 

- అన్నింటిలో మొదటిది ప్రసార భారతి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022ని క్షుణ్ణంగా పరిశీలించండి అభ్యర్థి అర్హత ప్రమాణాలను నెరవేర్చినట్లు నిర్ధారించుకొని దరఖాస్తులు చేసుకోండి.

-పై లింక్ నుండి లేదా అధికారిక నోటిఫికేషన్ నుండి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

-సూచించిన ఫార్మాట్‌లో ఫారమ్‌ను పూరించండి. మీ కేటగిరీ ప్రకారం దరఖాస్తు రుసుమును చెల్లించండి.

-మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత, అందించిన వివరాలు సరైనవని క్రాస్ వెరిఫై చేయండి.

-చివరిగా క్రింద పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు ఫారమ్‌ను పంపండి. డైరెక్టర్ (న్యూస్), ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రం, పోస్ట్- సైనిక్ స్కూల్, భువనేశ్వర్, పిన్ - 751005.

-రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా 31-అక్టోబర్-2022న లేదా అంతకు ముందు అందే విధంగా పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 28-09-2022

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 31-అక్టోబర్-2022

ప్రసార భారతి నోటిఫికేషన్ ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ అండ్ దరఖాస్తు ఫారమ్: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్: prasarbharati.gov.in

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, Doordarshan Andhra, JOBS, Odisha, Odisha news

ఉత్తమ కథలు