తెలంగాణలో(Telangana) ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. దీనిలో టీఎస్పీఎస్సీ, తెలంగాణ మెడికల్ బోర్డుకు సంబంధించి నియామక సంస్థల నుంచి నోటిపికేషన్లు భారీగా విడుదలయ్యాయి. ఇప్పటికే దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు(Notifications) వెలువడ్డాయి. వెలువడిన నోటిఫికేషన్లలో ఎక్కువగా జనవరి నెల నుంచే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. వీటిలో కొన్నింటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. మరికొన్ని పోస్టులకు పరీక్షలు కూడా ముగిశాయి. అయితే నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తులు సమర్పించడానికి చాలా మంది వెనుకాడతారు. తొందరగా చేసుకోవాలని బోర్డు అధికారులు చెబుతున్నా చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తుంటారు. తర్వాత సర్వర్ సమస్యలు రావడంతో ఇబ్బందులకు గురి అవుతుంటారు.
టీఎస్పీఎస్సీ(TSPSC), మెడికల్ బోర్టు(Medical Board) నుంచి దాదాపు 20 వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడగా.. దీనిలో ఒక్కో పోస్టుకు దరఖాస్తు గుడువు మూడు వారాల నుంచి నెల రోజుల వరకు ఇచ్చారు. అయితే ఇక్కడ ఏ నోటిఫికేష్లకు దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం.
1. జనవరి 03, 2023న హార్టికల్చర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీగా జనవరి 24, 2023గా నిర్ణయించారు.
2. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు జనవరి 06, 2023 నుంచి ప్రారభం కాగా.. జనవరి 27, 2023 చివరి తేదీగా నిర్ణయించారు.
3. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 06, 2023 నుంచి ప్రారభం కాగా.. జనవరి 27, 2023 చివరి తేదీగా నిర్ణయించారు.
4. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 10, 2023 న ప్రారంభం అయి...జనవరి 30, 2023న ముగుస్తుంది.
5. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
6.గ్రూప్ 2 దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఉంటుంది.
7.అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
8. లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఉంటుంది.
AIIMS Recruitment: ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలిలా..
9.గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు స్వీకరించనున్నారు.
10. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, TSPSC, Tspsc jobs