కొత్త ఐడియాతో ముందుకొచ్చిన ఢిల్లీ.. కేంద్రం ఓకే అంటే విద్యార్థులకు ఊరట..

వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదన చేసింది.

news18-telugu
Updated: June 6, 2020, 6:33 PM IST
కొత్త ఐడియాతో ముందుకొచ్చిన ఢిల్లీ.. కేంద్రం ఓకే అంటే విద్యార్థులకు ఊరట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లోనే ఉంది. ఈ క్రమంలో విద్యాసంవత్సరం కూడా వచ్చేస్తోంది. అసలు ఇప్పుడు విద్యాసంస్థలు తెరవాలా? వద్దా? అంశంపై జూలైలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. వచ్చే ఏడాది సిలబస్‌ను 30 శాతం తగ్గించాలంటూ ప్రతిపాదించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా. ఈ మేరకు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్‌తో కలసి జీవించడం ఎలాగో నేర్చుకోవాలని అందరూ చెబుతున్న నేపథ్యంలో అన్నీ ఆన్ లైన్ ద్వారా నేర్చుకోలేమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఆన్ లైన్ టీచింగ్ అనేది ఓ ప్రత్యామ్నాయం అయినా.. క్లాస్ రూమ్ టీచింగ్‌‌ను అది పూర్తిగా ఆక్రమించలేదని అన్నారు. అన్ని గ్రేడ్లు, అన్ని సబ్జెక్టుల్లోనూ 30 శాతం సిలబస్ తగ్గించడం వల్ల ప్రయోజనం ఉంటుందని, విద్యార్థుల మీద, టీచర్ల మీద కూడా ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 6, 2020, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading