ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) ద్వారా SI పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 16 జూలై 2022 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. దీని కోసం వారు అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ని సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఆగస్టు 14 వరకు కొనసాగుతుంది.
ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 37 పోస్ట్‌లు రిక్రూట్ చేయబడతాయి. ఇందులో 32 పురుష సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 5 మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 8 పోస్టులు, ఇతర వెనుకబడిన తరగతులకు 18 పోస్టులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఓబీసీ) 3 పోస్టులు, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 6 పోస్టులు, షెడ్యూల్డ్ తెగలకు 2 పోస్టులు కేటాయించారు.
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు నాలుగు రోజులే గడువు
విద్యార్హత
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. అభ్యర్థి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి
దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 6 కింద నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ
ITBP నిర్వహించే ఈ నియామకాలకు అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష(Written Test), డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
IBPS Clerk 2022: డిగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 ఉద్యోగాలకు అప్లై చేయండిలా
ఎలా దరఖాస్తు చేయాలి:
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించాలి. అక్కడ స్క్రోల్ అవుతున్న నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని అభ్యర్థి దానికి తగిన అర్హతలు ఉన్నాయో లేదో చూసుకొని దరఖాస్తు చేసుకోవాలి. జూలై 16 నుంచి ప్రారంభం అయిన ఈ దరఖాస్తులకు ఆగస్టు 14, 2022 చివరి గడువు.
ITBP (recruitment.itbpolice.nic.in) అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. పేజీ యొక్క కుడి వైపున అందుబాటులో ఉన్న 'New User Registration'పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేసుకొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ వెబ్ సైట్ లో కుడి వైపున ఉన్న లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ద్వారా లాగిన్ అయి.. అందులో వివరాలను నింపాల్సి ఉంటుంది. తర్వాత సబ్ మిట్ పై క్లిక్ చేసి.. దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోని భవిష్యత్ అవసరాల కోసం దగ్గరే ఉంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, Itbp, Police jobs, Sub inspector