SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

SBI Recruitment 2019 | ఇప్పటికే ఈ పోస్టులకు అప్లై చేసినవాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: October 11, 2019, 5:54 PM IST
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 11, 2019, 5:54 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లాంటి పోస్టుల భర్తీకి జూలైలో ఓ నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్ దరఖాస్తుకు గడువు ఆగస్ట్‌లోనే ముగిసింది. అయితే ఆయా పోస్టులకు అర్హతలను సవరించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. దీంతో ఆ ఉద్యోగాలకు మరోసారి రివైజ్డ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది ఎస్‌బీఐ. మొత్తం 76 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. ఇది రివైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి ఇప్పటికే ఈ పోస్టులకు అప్లై చేసినవాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అర్హతతో పాటు అనుభవం తప్పనిసరి. అర్హతల వివరాలు నోటిఫికేషన్‌లో చదివి తెలుసుకోవాలి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అర్హతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.


SBI Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...




మొత్తం పోస్టులు- 76
Loading...
డిప్యూటీ జనరల్ మేనేజర్- 01
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (సెక్టార్ స్పెషలిస్ట్)- 11
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (స్ట్రక్చరింగ్)- 04
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 10
క్రెడిట్ అనలిస్ట్- 50

SBI Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 31
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 31
దరఖాస్తు ప్రింట్ చేయడానికి చివరి తేదీ: 2019 నవంబర్ 30
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 2019 అక్టోబర్ 11 నుంచి 2019 అక్టోబర్ 31 వరకు

SBI Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేయండి.
Recruitment of SCO - DGM లింక్ పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫీజు చెల్లించండి.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు
First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...