కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 143 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్సైట్ portal.mhrdnats.gov.in సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 2022.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు – 143
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 73 పోస్టులు
అప్రెంటిస్ టెక్నీషియన్ - 70 పోస్టులు
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు తేదీ - 9 నవంబర్ 2022
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - డిసెంబర్ 7, 2022
వయో పరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు..
అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ మరియు డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు లేకుండానే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపికైన తర్వాత నెలకు రూ.12,000 చెల్లిస్తారు. మరోవైపు టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నెలకు రూ.10,200 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు ఎంపిక కావడానికి.. అభ్యర్థుల యొక్క మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దీని నుంచి అభ్యర్థులను డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apprenticeship, JOBS