హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In NIC: డిగ్రీ ఉంటే చాలు.. నెలకు రూ.2,16,600 జీతం పొందొచ్చు..

Jobs In NIC: డిగ్రీ ఉంటే చాలు.. నెలకు రూ.2,16,600 జీతం పొందొచ్చు..

Jobs In NIC: డిగ్రీ ఉంటే చాలు.. నెలకు రూ.2,16,600 జీతం పొందొచ్చు..

Jobs In NIC: డిగ్రీ ఉంటే చాలు.. నెలకు రూ.2,16,600 జీతం పొందొచ్చు..

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్ఐసీలో 127 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(National Informatic Centre) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్ఐసీలో 127 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.calicut.nielit.inని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కొరకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అభ్యర్థులు నవంబర్ 21వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 127 ఉన్నాయి.

దీనిలో విభాగాల వారీగా ఇలా..

ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, రేడియో ఫిజిక్స్ & ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్, కమ్యూనికేషన్, కంప్యూటర్ మరియు నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, సైబర్ లా, బయో-ఇన్ఫర్మేటిక్స్, రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS), జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ డిజైన్, ఆపరేషన్స్ రీసెర్చ్, టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేటిక్స్ మరియు ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

APPSC Notification: గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల..

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ/ మాస్టర్ డిగ్రీ/ ME/ MTech/ BE/ BTech/ MPhil ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా.. అభ్యర్థికి సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితి విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ఫీజు..

దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ అభ్యర్థులకు దరఖస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

జీతం

ఈ పోస్టులలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,700 నుండి రూ.2,16,600 వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం..

వ్యక్తిగత ఇంటరాక్షన్ , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు https://www.calicut.nielit.in/nic21/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.

First published:

Tags: Career and Courses, Central Govt Jobs, JOBS