RECRUITMENT ALERT FROM SBI TO SSC THESE ARE THE JOBS THAT NEED TO BE APPLIED FOR THIS MONTH GH VB
Recruitment Alert: ఎస్బీఐ నుంచి ఎస్ఎస్సీ వరకు.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే..
(ప్రతీకాత్మక చిత్రం)
మంచి ఉద్యోగంలో స్థిరపడడం చాలా మంది కల. అందుకు నిరంతరంగా శ్రమిస్తుంటారు. తాజాగా SBI నుండి SSC వరకు అనేక సంస్థలు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థుల కోసం నియామకాలు చేపట్టే వివిధ సంస్థల జాబితా రూపొందించాం.
మంచి ఉద్యోగంలో స్థిరపడడం చాలా మంది కల. అందుకు నిరంతరంగా శ్రమిస్తుంటారు. తాజాగా State Bank Of India నుండి Staff Selection Commission వరకు అనేక సంస్థలు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ (Recruitment) నిర్వహిస్తున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థుల కోసం నియామకాలు చేపట్టే వివిధ సంస్థల జాబితా రూపొందించాం. పరిశీలించి నచ్చిన జాబ్‌కు దరఖాస్తు చేసుకోండి.
* ఎస్బీఐ రిక్రూట్మెంట్ - 2022
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ సిబ్బంది నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన 641 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధికారిక వెబ్సైట్ sbi.co.inద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 7గా నిర్ణయించారు. మొత్తం 641 పోస్టులలో 503 ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్ - ఎనీటైమ్ ఛానెల్స్ (CMF-AC) పోస్టులు, 130 ఛానల్ మేనేజర్ సూపర్వైజర్ ఎనీటైమ్ ఛానెల్స్ (CMS-AC) పోస్టులు, మిగిలిన 8 సపోర్ట్ ఆఫీసర్- ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC) పోస్టులు ఉన్నాయి.
* JSSC రిక్రూట్మెంట్ - 2022
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) వివిధ విభాగాల్లో 991 క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 964 ఖాళీలు క్లర్క్‌లు కాగా, 27 స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు JSSC అధికారిక పోర్టల్ jssc.nic.in ద్వారా ఆన్లైన్లో జూన్ 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
* IOCL రిక్రూట్మెంట్-2022
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) గేట్ -2022 ఆధారంగా ఇంజనీర్లు, ఆఫీసర్ల పోస్టుల భర్తీకి గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధికారిక వెబ్సైట్iocl.com ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మే 22గా నిర్ణయించారు. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* కొచ్చిన్ షిప్‌యార్డ్ రిక్రూట్మెంట్
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్‌మన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వంటి 261 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 6లోపు సంస్థ అధికారిక వెబ్సైట్ cochinshipyard.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రతి పోస్టుకు మెరిట్ లిస్ట్ తయారు చేయనున్నారు.
* MRPL రిక్రూట్మెంట్
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ (MRPL) గేట్-2022 స్కోర్ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మొత్తం కలిపి 65 పోస్టులను భర్తీ చేయనుంది. GATE 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మే 28గా నిర్ణయించారు.
* ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్10
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో ఆగస్టు 2022లో జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను ఎస్ఎస్సీ భర్తీ చేయనుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.