HOME »NEWS »JOBS & EDUCATION »realme india to open 50 realme exclusive stores and announced 15000 jobs including 5000 realme advisors ss

Realme Jobs: గుడ్ న్యూస్... 15,000 ఉద్యోగాలు ప్రకటించిన రియల్‌మీ

Realme Jobs: గుడ్ న్యూస్... 15,000 ఉద్యోగాలు ప్రకటించిన రియల్‌మీ
Realme Jobs: గుడ్ న్యూస్... 15,000 ఉద్యోగాలు ప్రకటించిన రియల్‌మీ (image: Realme)

Jobs in Realme | చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన రియల్‌మీ భారీగా ఉద్యోగాలు కల్పించనుంది. రియల్‌మీ 7 ప్రో, రియల్‌మీ 7 లాంఛింగ్‌ ఈవెంట్‌లో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.

  • Share this:
    రియల్‌మీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ తర్వాత అదే స్థాయిలో సంచలనాలు సృష్టించిన చైనీస్ మొబైల్ కంపెనీ. మొదట స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అడుగు పెట్టిన రియల్‌మీ ఆ తర్వాత పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ హెడ్‌సెట్ లాంటి మొబైల్ యాక్సెసరీస్‌తో పాటు టీవీ మార్కెట్‌లోకి కూడా వచ్చింది. ఇంకా మార్కెట్ విస్తరించాలని భావిస్తున్న రియల్‌మీ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో 15,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు ప్రకటించింది. రియల్‌మీ 7 ప్రో, రియల్‌మీ 7 లాంఛింగ్‌ ఈవెంట్‌లో కంపెనీ  సీఈఓ మాధవ్ సేఠ్ ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో మరో 50 రియల్‌మీ ఎక్స్‌క్లూజీవ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నామని, 5000 మంది రియల్‌మీ అడ్వైజర్లను నియమించుకుంటున్నామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.


    భారతదేశంలో తమకు 2.7 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారని ప్రకటించింది రియల్‌మీ. ప్రపంచవ్యాప్తంగా 59 మార్కెట్స్‌లో చూస్తే 4.5 కోట్ల యూజర్లున్నారు. అంటే వారిలో సగం యూజర్లు ఇండియాలోనే ఉన్నారు. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా రియల్‌మీ పేరు తెచ్చుకుంది. కేవలం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పైన మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలనూ తీసుకొస్తోంది. మొబైల్ యాక్సెసరీస్‌తో పాటు లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్‌ని లాంఛ్ చేస్తోంది.


    ఈరోజు స్మార్ట్ యాక్సెసరీస్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్‌ని లాంఛ్ చేసింది. రియల్‌మీ ఎం1 సోనిక్ పేరుతో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ని పరిచయం చేసింది. ధర రూ.1,999. ఇక రియల్‌మీ అడ్వెంచర్ లగేజ్ రిలీజ్ చేసింది. ధర రూ.2,999. ఇక వీటితో పాటు రియల్‌మీ టోట్ బ్యాగ్ 2 రిలీజ్ చేసింది. ధర రూ.999. వీటి సేల్ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది.
    Published by:Santhosh Kumar S
    First published:September 03, 2020, 17:05 IST