రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 241 ఖాళీలున్నాయి. జనరల్-113, ఓబీసీ-45, ఈడబ్ల్యూఎస్-18, ఎస్సీ-32, ఎస్టీ-33 పోస్టుల్ని కేటాయించారు. హైదరాబాద్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల ఎక్స్-సర్వీస్‌మెన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://opportunities.rbi.org.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
RBI Security Guard Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 241
అహ్మదాబాద్ - 7
బెంగళూరు - 12
భోపాల్ - 10
భువనేశ్వర్ - 8
చండీగఢ్- 2
చెన్నై - 22
గౌహతి - 11
హైదరాబాద్ - 3
జైపూర్ - 10
జమ్మూ - 4
కాన్పూర్ - 5
కోల్‌కతా - 15
లక్నో - 5
ముంబై - 84
నాగ్‌పూర్ - 12
న్యూ ఢిల్లీ - 17
పాట్నా -11
తిరువనంతపురం - 3
RBI Security Guard Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 12
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థి ఎక్స్-సర్వీస్‌మెన్ అయి ఉండాలి.
వయస్సు- 25 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.50
ఎంపిక విధానం- ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రీ-రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్
వేతనం- రూ.27,678.
RBI Security Guard Recruitment 2021: అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ముందుగా https://www.rbi.org.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Opportunities@RBI పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Current Vacancies ట్యాబ్‌లో Vacancies పైన క్లిక్ చేయాలి.
Recruitment for the post of Security Guards - 2020 నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా చదవాలి.
ఆ తర్వాత “Recruitment for the post of Security Guards- 2020” పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.