రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 39 కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్స్, అనలిస్ట్ పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ 2020 ఏప్రిల్ 9న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ నియామక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయం ఆర్బీఐ వెల్లడించలేదు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని మాత్రమే నోటీసు జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్సైట్ https://www.rbi.org.in/ ఫాలో అవుతూ ఉండాలి.
RBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- 39
భర్తీ చేయనున్న పోస్టులు- కన్సల్టెంట్, ఎకనమిస్ట్, డేటా అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, ఐఎస్ ఆడిటర్, స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్, అకౌంట్స్ స్పెషలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Free Course: సాఫ్ట్వేర్ జాబ్ మీ కలా? ఈ ఫ్రీ కోర్సు చేయండి
Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
Jobs: సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... హైదరాబాద్ రీజియన్‌లో ఖాళీలుPublished by:Santhosh Kumar S
First published:April 09, 2020, 10:29 IST