RBI Jobs: ఆర్‌బీఐలో 926 అసిస్టెంట్ జాబ్స్... రేపే లాస్ట్ డేట్

RBI Assistant Recruitment 2020 | డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి మరిన్ని వివరాలు చూడొచ్చు.

news18-telugu
Updated: January 23, 2020, 11:50 AM IST
RBI Jobs: ఆర్‌బీఐలో 926 అసిస్టెంట్ జాబ్స్... రేపే లాస్ట్ డేట్
RBI Jobs: ఆర్‌బీఐలో 926 అసిస్టెంట్ జాబ్స్... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఆర్‌బీఐ 926 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2020 జనవరి 16న ముగిసిన దరఖాస్తు గడువును జనవరి 24 వరకు పొడిగించింది ఆర్‌బీఐ. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు జనవరి 24 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో 926 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్‌బీఐ. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో కూడా ఖాళీలున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక చేస్తారు. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి మరిన్ని వివరాలు చూడొచ్చు.

RBI Assistant Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 926
అహ్మదాబాద్- 19
బెంగళూరు- 21
భోపాల్- 42
భువనేశ్వర్- 28చండీగఢ్- 35
చెన్నై- 67
గువాహతి-55
హైదరాబాద్- 25
జైపూర్- 37
జమ్మూ- 13
కాన్పూర్ అండ్ లక్నో- 63
కోల్‌కతా- 11
ముంబై- 419
నాగ్‌పూర్- 13
న్యూఢిల్లీ- 34
పాట్నా- 24
తిరువనంతపురం అండ్ కొచ్చి- 20

RBI Assistant Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


నోటిఫికేషన్ విడుదల- 2019 డిసెంబర్ 23
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 డిసెంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 24
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2019 డిసెంబర్ 23 నుంచి 2020 జనవరి 24
దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2020 జనవరి 24
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 8

RBI Assistant Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


అసిస్టెంట్ పోస్టుకు విద్యార్హత- ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్‌ తెలిసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.450. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు రూ.50.
ఎంపిక ప్రక్రియ- ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్. లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు గడువు పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

Jobs: 10 నోటిఫికేషన్లు... 16,545 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: January 23, 2020, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading