• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • RBI OFFICE ATTENDANT RECRUITMENT 2021 RESERVE BANK OF INDIA RELEASED NOTIFICATION FOR 841 OFFICE ATTENDANT POSTS 57 VACANCIES IN HYDERABAD SS

RBI Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి గొప్ప అవకాశం... ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు

RBI Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి గొప్ప అవకాశం... ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు

RBI Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి గొప్ప అవకాశం... ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

RBI Recruitment 2021 | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

  • Share this:
    టెన్త్ పాస్ అయినవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి. హైదరాబాద్‌లో 57 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://rbi.org.in/ లేదా
    https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    RBI Office Attendant Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    హైదరాబాద్ - 57
    అహ్మదాబాద్ - 50
    బెంగళూరు - 28
    భోపాల్ - 25
    భువనేశ్వర్ - 24
    చండీగఢ్ - 31
    చెన్నై - 71
    గౌహతి - 38
    జమ్మూ - 9
    జైపూర్ - 43
    కాన్పూర్- 69
    కోల్‌కతా - 35
    ముంబై - 202
    నాగ్‌పూర్ - 55
    న్యూ ఢిల్లీ - 50
    పాట్నా - 28
    తిరువనంతపురం - 26

    Prasar Bharati Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో నివసించేవారికి మాత్రమే

    SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

    RBI Office Attendant Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 24
    దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 24
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
    టెస్ట్ ఫీజు చెల్లింపు- 2021 ఫిబ్రవరి 24 నుంచి 2021 మార్చి 15
    ఆన్‌లైన్ టెస్ట్- 2021 ఏప్రిల్ 9, 10

    IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 505 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    BRO Recruitment 2021: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

    RBI Office Attendant Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలోని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పాస్ అయి ఉండాలి.
    ఇతర అర్హతలు- అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. గ్రాడ్యుయేట్స్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేయకూడదు.
    వయస్సు- 18 నుంచి 25 ఏళ్ల లోపు. 1996 ఫిబ్రవరి 2 నుంచి 2003 ఫిబ్రవరి 1 లోపు జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం- దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్. ఈ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.50
    వేతనం- రూ.26,508.
    Published by:Santhosh Kumar S
    First published: