హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RBI Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

RBI Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

RBI Office Attendant Recruitment 2021 | ఆర్‌బీఐ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సగంతి తెలిసిందే. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

RBI Office Attendant Recruitment 2021 | ఆర్‌బీఐ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సగంతి తెలిసిందే. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

RBI Office Attendant Recruitment 2021 | ఆర్‌బీఐ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సగంతి తెలిసిందే. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. టెన్త్ పాస్ అయినవారు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. మరి ఆర్‌బీఐలో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  Jobs for 10th Passed: ఈ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ టెన్త్, ఇంటర్ పాస్ అయినవారికే... వెంటనే అప్లై చేయండి

  Police Jobs: పోలీస్ ఉద్యోగం మీ కలా? నోటిఫికేషన్ వచ్చేస్తోంది... రెడీగా ఉండండి

  RBI Office Attendant Recruitment 2021: అప్లై చేయండిలా


  అభ్యర్థులు ముందుగా https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  అందులో Current Vacancies ట్యాబ్ క్లిక్ చేసి Vacancies పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత Recruitment for the post of Office Attendants - 2020 పైన క్లిక్ చేయాలి.

  ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. ఆ తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.

  పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.

  ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.

  దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.

  మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.

  అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.

  దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

  First published:

  Tags: Bank Jobs 2021, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Rbi, Reserve Bank of India

  ఉత్తమ కథలు