RBI GRADE B RELEASE OF RBI GRADE B PHASE 2 ADMIT CARDS DOWNLOAD KNOW DETAILS GH EVK
RBI Grade B: ఆర్బీఐ గ్రేడ్- B ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
RBI Recruitment 2022 | ఆర్బీఐ గ్రేడ్ బీ ఫేజ్ 2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ (Admit Cards)లను ఆన్లైన్లో విడుదల చేసింది. అభ్యర్థులు ఇప్పుడు తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు అధికారిక వెబ్సైట్ అయిన rbi.org.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది.
ప్రముఖ బ్యాంకింగ్ (Banking) దిగ్గజం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాలను చేపడుతోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలలో గ్రేడ్ బీ ఆఫీసర్ (Grade B Officer) పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్బీఐ గ్రేడ్ బీ ఫేజ్ 2 పరీక్షను నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఆర్బీఐ గ్రేడ్ బీ ఫేజ్ 2 (RBI Grade B Phase 2) పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ (Admit Cards)లను ఆన్లైన్లో విడుదల చేసింది. అభ్యర్థులు ఇప్పుడు తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు అధికారిక వెబ్సైట్ అయిన rbi.org.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫాలో కావాల్సిన స్టెప్స్, డైరెక్ట్ లింక్ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్బీఐ గ్రేడ్ బీ ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్ 2022 జూన్ 25, 2022న జరగనున్న డీఆర్ (జనరల్) పరీక్షకు సంబంధించినదని అభ్యర్థులు గమనించాలి. ఆర్బీఐ గ్రేడ్ బీ డీఆర్ ఫేజ్ 1 పరీక్ష ఇప్పటికే నిర్వహించడం జరిగిందని, దాని రిజల్ట్స్ కూడా ప్రకటించారని అభ్యర్థులు గమనించాలి. తాజాగా రిలీజ్ అయిన ఈ హాల్ టికెట్స్ ఇప్పుడు ఫేజ్ 2 పరీక్ష కోసం కాగా ఈ ఆర్బీఐ అడ్మిట్ కార్డ్‌ని లాగిన్ చేయడానికి.. డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి కింద ఇచ్చిన డైరెక్ట్ లింక్.. స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం ఈ కాల్ లెటర్ కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకోవాలి.
ఆర్బీఐ గ్రేడ్ బీ డీఆర్ అడ్మిట్ కార్డ్ జూన్ 25, 2022 వరకు అధికారిక వెబ్సైట్ https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4146లో అందుబాటులో ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. ఈ తేదీ తర్వాత, పరీక్ష జరుగుతుంది కాబట్టి వీటిని శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డ్‌ని ఎగ్జామ్ రోజు పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడం మర్చిపోకూడదు. ఆ తర్వాత కూడా దానిని సురక్షితంగా ఉంచుకోవడం మంచిది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.