• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • RBI GRADE B RECRUITMENT 2021 RESERVE BANK OF INDIA TO RELEASE NOTIFICATION FOR GRADE B POSTS SOON SS

RBI Grade B Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్... ఆర్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే

RBI Grade B Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్... ఆర్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే

RBI Grade B Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్... ఆర్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

RBI Grade B Recruitment 2021 | బ్యాంకులో ఉద్యోగం కోరుకునేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI భారీగా పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఆర్‌బీఐలో గ్రేడ్ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 25న ఈ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న వార్తలొస్తున్నాయి. జనవరి 25న అంటే ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే జనవరి 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈసారి ఈ నోటిఫికేషన్ ద్వారా 300 పైగా పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రేడ్ బీ (DR) జనరల్, గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్, గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం లాంటి పోస్టులుంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం https://www.rbi.org.in/ లేదా https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి.

    RBI Grade B Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే


    మొత్తం ఖాళీలు- 322 (అంచనా)
    గ్రేడ్ బీ (DR) జనరల్- 270
    గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్- 29
    గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం- 23

    UPSC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 249 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంకులో 134 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే ఛాన్స్

    RBI Grade B Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    నోటిఫికేషన్ విడుదల- 2021 జనవరి 25
    దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 27
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
    మొదటి దశ పరీక్షలు- 2021 మార్చి 1
    రెండో దశ పరీక్షలు- 2021 ఏప్రిల్ 1
    గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్, డీఎస్ఐఎం పేపర్ 2, 3 ఎగ్జామ్స్- 2021 మార్చి 31

    ECIL Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    SBI Recuritment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... అప్లై చేయండి ఇలా

    RBI Grade B Recruitment 2021: విద్యార్హతలు ఇవే


    గ్రేడ్ బీ (DR) జనరల్- బ్యాచిలర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉండాలి. టెన్త్, ఇంటర్‌లో 60 శాతం మార్కులు ఉండాలి.
    గ్రేడ్ బీ (DR) డీఈపీఆర్- ఎకనమిక్స్, ఎకనమెట్రిక్స్, క్వాంటిటేటీవ్ ఎకనమిక్స్, మ్యాథమెటికల్ ఎకనమిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనమిక్స్ కోర్స్, ఫైనాన్స్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా పీజీడీఎం, ఎంబీఏ ఫైనాన్స్ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.
    గ్రేడ్ బీ (DR) డీఎస్ఐఎం- స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనమిక్స్, ఎకనమెట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి.
    Published by:Santhosh Kumar S
    First published: