Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... జూన్ 15 చివరి తేదీ

Rashtriya Indian Military College RIMC admissions | మిలిటరీ కాలేజ్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. అడ్మిషన్లకు గడువు పెరిగింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 1, 2020, 12:00 PM IST
Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... జూన్ 15 చివరి తేదీ
Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... జూన్ 15 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విద్యార్థులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్-RIMC లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువు పెరిగింది. వాస్తవానికి ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 31 చివరి తేదీ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా గడువు పెంచుతున్నట్టు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రకటించింది. ఇప్పుడు చివరి తేదీని కూడా ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 15 లోగా దరఖాస్తు చేయొచ్చు. పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ కాలేజీలో జనవరి 2021 బ్యాచ్‌కు అడ్మిషన్ల కోసం ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌ అడ్మిషన్ వివరాలు చూస్తే 8వ తరగతిలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేయాలి. అంటే 7వ తరగతి చదువుతున్న, పాసైన విద్యార్థులు మాత్రమే ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో అడ్మిషన్ల కోసం అప్లై చేయాలి. అబ్బాయిలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వయస్సు 11.5 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫామ్‌ను రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి నేరుగా పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు ఫీజు డీడీ తీసి పంపాలి. http://www.rimc.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ప్రాస్పెక్టస్ పొందొచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ఆర్ఐఎంసీలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఫీజు సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.42,000 చెల్లిస్తే చాలు. భవిష్యత్తులో ఫీజు పెరిగే అవకాశముంది. అడ్మిషన్ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.20,000 చెల్లించాలి. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత రూ.20,000 రీఫండ్ ఇస్తారు. మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 నుంచి రూ.20,000 స్కాలర్‌షిప్.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TCS iON: గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఉచితంగా స్కిల్ ట్రైనింగ్

Jobs: హైదరాబాద్‌లోని ఇఫ్లూలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవేTelangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 1, 2020, 11:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading