హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు..

Telangana Jobs: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (Hyderabad-DMHO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (Hyderabad-DMHO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (TS Job Notification) విడుదల చేసింది. సపోర్ట్ ఇంజనీర్ (Support Engineer) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని.. వాటిలో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. దానితో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేసి.. O/o. District Medical & Health Officer, Ranga Reddy చిరునామాలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. వివరాలకు https://rangareddy.telangana.gov.in/ సందర్శించడి. ఈ పోస్టులు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.

దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన సర్టిఫికేట్ల వివరాలిలా..

1. పదో తరగతి మెమో

2.ఇంటర్ మెమో

3. డిగ్రీ లేదా తత్సమాన మార్కుల షీట్

4. 1 నుంచి 7 వరకు స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు.. కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలను జత చేయాలి.

5. రూ.500 దరఖాస్తు ఫీజు డీడీ రూపంలో చెల్లించి.. దానిని వీటితో పాటు జత చేయాలి.

6. వీటితో పాటు.. 4 ఏళ్ల అనుభవ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా జత చేయాలి.

మొత్తం 5 సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. బీటెక్(సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ)/ఎంసీఏ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు జూలై 01, 2023 నాటికి 44 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపిక:

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మీకు బీటెక్ లో వచ్చిన మార్కులను ఆధారం చేసుకొని.. ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Dmho, JOBS, Rangareddy

ఉత్తమ కథలు