సైన్యంలో చేరాలనే కోరిక ఉన్న యువతకు ఇదొక గొప్ప అవకాశం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం(Agnipath Scheme) కింద అగ్నివీరుల కోసం నోటిఫికేషన్స్(Notifications) వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రాష్ట్రాల వారీగా అగ్నివీరుల కోసం ర్యాలీలు(Rallies) జరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 29 నుంచి జనవరి 15 వరకు ఈ ఎంపికలు అనేది సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ (AOC) కేంద్రంలో జరగనున్నాయి. ఈ మేరకు ఏఓసీ ట్రాక్ లో(AOC Track) ఈ ర్యాలీ(Rally) ఉంటుందని ఏఓసీ కేంద్రం పేర్కొంది. ఆసక్తి, అర్హత గల యువత ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), Tradesmen, టెక్(AE) విభాగాల్లో ఈ ఎంపికలు ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ కోటా కింద వీరిని నియమించనున్నారు. ఇక క్రీడాకారులు విభాగాల్లో అర్హతగల యువతీ,యువకులు ర్యాలీలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ పేర్కొంది.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 17 సంవత్సరాల ఆరు నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఇటీవల 21 సంవత్సరాల గరిష్ట వయస్సు నుంచి 23 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.
అర్హతలు..
ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థుల యొక్క అర్హతలు అనేవి ట్రేడ్స్ మెన్ పోస్టులకు పదోతరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. టెక్ పోస్టులకు సైన్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీతో పాటు.. సైన్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
ఈ నెల 26 నుంచే క్రీడాకారులకు..
ఈ నెల 26 ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రంలోని థాపర్ స్టడియంలో ఓపెన్ కేటగిరీలో ఎంపికకు క్రీడాకారులు హాజరు కావాలని సైనిక అధికారులు పేర్కొన్నారు.
బాస్కెట్ బాల్, బాక్సింగ్, కబడ్డీ క్రీడల్లో జూనియర్స్, క్రికెట్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రాతినిథ్యం వహించి రాణించిన వారు తగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ పత్రాలు కూడా రెండేళ్ల లోపు తీసుకొని ఉండాలన్నారు. హాజరయ్యే సమయానికి రెండేళ్లు అంటే.. 26-10-2021 నుంచి 26-10-2022 మధ్య ఉండాలి. వీటికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://indianarmy.nic.in/ ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Career and Courses, JOBS, Rally, Secunderabad