RALIWAY JOBS KNOW ABOUT RAILWAY RECRUITMENT BOARD RRB NTPC SYLLABUS PREPARATION AND BOOKS TO READ SS
Raliway Jobs: ఆర్ఆర్బీ పరీక్ష రాస్తున్నారా? చదవాల్సిన పుస్తకాలు ఇవే...
Raliway Jobs: ఆర్ఆర్బీ పరీక్ష రాస్తున్నారా? చదవాల్సిన పుస్తకాలు ఇవే...
RRB NTPC Recruitment 2019 | మీరు కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ ఏంటీ? ఏ పుస్తకాలు చదవాలి? తెలుసుకోండి.
ఇటీవల రైల్వే ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వచ్చాయి. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC, లెవెల్ 1, గ్రూప్-డీ, పారామెడికల్, మినిస్టీరియల్... ఇలా వేర్వేరు పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఆర్ఆర్బీ. ఎన్టీపీసీ పోస్టులే 35 వేలకు పైన ఉన్నాయి. ఎన్టీపీసీ కింద కమర్షియల్ అప్రెంటీస్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సీనియర్ టైమ్ కీపర్, లోకోపైలట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, లైన్మెన్, గూడ్స్ గార్డ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఇప్పటికే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగానికి దరఖాస్తు గడువు ముగిసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారంతా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మరి మీరు కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ ఏంటీ? ఏ పుస్తకాలు చదవాలి? తెలుసుకోండి.
RRB NTPC Recruitment 2019: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎంపిక విధానం ఇదే...
1. ప్రిలిమ్స్- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
2. మెయిన్స్- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
3. జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ పోస్టులకు టైపింగ్ టెస్ట్
4. ట్రాఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టులకు యాప్టిట్యూడ్ టెస్ట్
5. డాక్యుమెంట్ వెరిఫికేషన్
6. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్
7. ఫైనల్ సెలెక్షన్
ఈ దశలన్నీ పూర్తి చేసుకున్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఆర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించాలి.
1. జనరల్ సైన్స్ కోసం 6 నుంచి 10 తరగతి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ NCERT పుస్తకాలు చదవాలి.
2. జనరల్ అవేర్నెస్ కోసం జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. NCERT హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పొలిటికల్ సైన్స్ పుస్తకాలు చదవాలి.
3. రీజనింగ్‌లో క్లాసిఫికేషన్, నెంబర్, ఆల్ఫబెట్ సిరీస్, అనాలజీ, డిస్టెన్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ లాంటి అంశాలు చదవాలి. వీటిపై పట్టు సాధించిన తర్వాత స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్ లాంటివి చదవాలి.
4. ఆర్థమెటిక్ కోసం హై-స్కూల్ లెవెల్ గణితం పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.
Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.