Home /News /jobs /

RAKESH JHUNJHUNWALA IN HIS COLLEGE DAYS ACTED WITH THE SPIRIT OF HIS TIME AND INVESTED WISELY CURRENTLY HE IS THE KING OF THE STOCK MARKET VB

Rakesh Jhunjhunwala: ఆ సపోర్ట్ తోనే రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్ రారాజు అయ్యాడు..! కాలేజ్ రోజుల్లో అలా..

Rakesh Jhunjhunwala: ఆ సపోర్ట్ తోనే రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్ రారాజు అయ్యాడు.. కాలేజ్ రోజుల్లో అలా..

Rakesh Jhunjhunwala: ఆ సపోర్ట్ తోనే రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్ రారాజు అయ్యాడు.. కాలేజ్ రోజుల్లో అలా..

స్టాక్ మార్కెట్ సుల్తాన్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆదివారం ఉదయం మృతి చెందారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 62 ఏళ్ల వయసులో మరణించారు. కొన్నాళ్ల నుంచి అతను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India
స్టాక్ మార్కెట్ సుల్తాన్ రాకేష్ జున్‌జున్‌వాలా (Rakesh Jhunjhunwala) ఆదివారం ఉదయం మృతి చెందారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 62 ఏళ్ల వయసులో మరణించారు. కొన్నాళ్ల నుంచి అతను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. రాకేష్ జున్‌జున్‌వాలా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. రాకేష్ జున్‌జున్‌వాలా విద్యాభ్యాసం విషయానికి వస్తే.. అతని పాఠశాల విద్య చాలా సాధారణ పాఠశాల నుండి జరిగింది. ముంబైలోని సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి 1985లో బి.కామ్ డిగ్రీ చేశారు. బి.కాం చేసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ (CA) కావాలని కలలు కన్నాడు. దీని తర్వాత అతను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో అడ్మిషన్(Admission) తీసుకున్నాడు. ఇలా తన CA చదువును పూర్తి చేశాడు.

​​AIIMS Recruitment 2022: ఎయిమ్స్ లో ఖాళీలు.. పోస్టుల సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ ఇలా..


రాకేష్ ఝున్‌జున్‌వాలాకు చిన్నప్పటి నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఉండేది. అతని తండ్రి తన స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు.. రాకేష్ ఆ విషయాలను చాలా శ్రద్ధగా వినేవాడు. కాలేజీలో చదివే రోజుల్లో తన తోటి స్నేహితులతో మార్కెట్ టెర్మినాలజీ గురించి సంభాషించేవారు.



అప్పుడే అతడి అంచనాలు నిజమయ్యేయి. అతని సమయస్పూర్తి, షేర్ మార్కెట్లో ఉన్న తెలివికి స్నేహితులు ఆశ్చర్యపోయేవారు. ఇలా చదువుకునే సమయంలో స్టాక్ మార్కెట్ లోని మెళకువలు నేర్చుకుని చదువు పూర్తయ్యాక సాధారణ పెట్టుబడిదారుడిలా స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టాడు.



స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు తన తండ్రి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. స్నేహితుల దగ్గర ఒక్క రూపాయి కూడా అడగనివ్వకుండా షేర్లకు కావాల్సిన డబ్బులను ఇచ్చేవాడు.  ఇంట్లో సపోర్ట్ తో అతడు ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాడు. 1985లో అతడు  షేర్లను రూ. 5వేలకు కొని.. అత్యధిక లాభాలు చూశాడు. నెలరోజుల్లోని అతడు పెట్టిన పెట్టుబడిని మూడింతలు చేసి చూపించాడు. ఆ రోజు నుంచి వెనుదిరిగి చూడలేదు.

AP-TS Postal Jobs: పోస్టల్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఖాళీలు.. APలో 3వేలు, TSలో 2వేలకు పైగా పోస్టుల భర్తీ..


స్టాక్ మార్కెట్‌లో రారాజుగా పేరొందిన జున్‌జున్‌వాలా 5 జూలై 1960న హైదరాబాద్ లో జన్మించారు.  అతని తండ్రి రాధేశ్యామ్ జున్‌జున్‌వాలా ఆదాయపు పన్ను అధికారిగా హైదరాబాద్ లో పనిచేశారు.  రాకేశ్ తల్లి పేరు ఊర్మిళ ఝున్‌ఝున్‌వాలా, రాకేష్ భార్య పేరు రేఖ ఝున్‌ఝున్‌వాలా. అతని నికర విలువ రూ. 46.18 వేల కోట్లుగా ఉంది. రాకేష్ జున్‌జున్‌వాలా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. అంతే కాకుండా ఆయనకు వాహనాలంటే చాలా ఇష్టం. అతని సేకరణలో BMW, Audi మరియు Mercedes వంటి వాహనాలు ఉన్నాయి.జున్‌జున్‌వాలా ఆప్‌టెక్ లిమిటెడ్ , హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Business, BUSINESS NEWS, Career and Courses, Mumbai, Rakesh Jhunjhunwala, Share Market Update, Stock Market

తదుపరి వార్తలు