Online Courses: రాజస్థాన్ రాయల్స్ - INSEAD భాగ‌స్వామ్యంలో ఆన్‌లైన్ కోర్సు ప్రారంభం

లీడ‌ర్‌షిప్ అండ్ ప‌ర్ఫామెన్స్ కోర్స్‌

ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ మరియు బిజినెస్ స్కూల్ INSEAD సంయుక్తంగా ‘లీడర్‌షిప్ అండ్ పెర్ఫార్మెన్స్(‘Leadership and performance)’ అనే అంశంపై ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ఈ కోర్సు కోసం రిజిస్ట్రేషన్లు నవంబర్ 10, 2021 న ముగుస్తాయి.

  • Share this:
    ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ మరియు బిజినెస్ స్కూల్ INSEAD సంయుక్తంగా ‘లీడర్‌షిప్ అండ్ పెర్ఫార్మెన్స్(‘Leadership and performance)’ అనే అంశంపై సంయుక్త ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ఈ కోర్సు కోసం రిజిస్ట్రేషన్లు నవంబర్ 10, 2021 న ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని INSEAD అధ్యాపకులు నిర్వహిస్తారు. ప్ర‌స్తుతం ఉన్న వేగవంతమైన డిజిటల్ యుగంలో ఎదుర్కొంటున్న సవాళ్లను స్వీకరించ‌డం ఎలానో వారు నేర్పిస్తారు. అంతే కాకుండా NSEAD కోచ్‌లు వ్యక్తిగతీకరించిన (Personalised) కోర్సును అందిస్తారు. కోర్సు విధానంలో వారి అనుభ‌వాల‌ను INSEAD కోచ్‌లు పంచుకొంటారు. జీవితంలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల అవ‌శ్య‌క‌త‌ను ఈ కోర్సులో నేర్పిస్తారు. అంతే కాకుండా ఈ కోర్సులో ఐపీఎల్ టీమ్ (IPL team) రాజస్థాన్ రాయల్స్ భాగ‌స్వామిగా ఉంది.

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి కెప్టెన్ సంజు శాంసన్‌తో పాటు క్రికెట్ డైరెక్ట‌ర్ (Cricket Director) కుమార్ సంగక్కర కూడా ఈ కార్య‌క్ర మంలో పాల్గొంటారు. వారు క్రీడ‌ల్లో పోటీత‌త్వంతోపాటు నాయకత్వంపై మాస్టర్ క్లాసులను అందిస్తారు. దీనిపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సీఈఓ జేక్ లష్ మెక్‌క్రం మాట్లాడారు. ఈ ఉమ్మ‌డి ఆన్‌లైన్ విద్యా (online Education) కార్య‌క్ర‌మంలో విద్యార్థులు (Students) జీవితాభివృద్ధి.. క్రీడ‌లపై అభిరుచి మిళితం చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. మైదానంలో మరియు వెలుపల టాలెంట్ డెవలప్‌మెంట్‌పై మాకు మక్కువ ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసే కొంతమంది వ్యక్తులు భవిష్యత్తులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్‌మెంట్ టీమ్‌లో చేరతారని నేను ఆశిస్తున్నానని అన్నారు.

    SSC Recruitment 2021: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 3,261 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల


    ఈ కార్య‌క్ర‌మంలో INSEAD ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సమీర్ హసిజా మాట్లాడుతూ రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి 'లీడర్‌షిప్ అండ్ పెర్ఫార్మెన్స్' పై మా ఉమ్మడి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నామ‌ని అన్నారు. ఇండియాలో క్రికెట్ అంటే చాలా మ‌క్కువ అని అన్నారు. క్రికెట్‌ను ఉప‌యోగించి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్లో మెరుగైన శిక్ష‌ణ అందించ‌డానికి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించామ‌న్నారు.

    ఈ నెల ప్రారంభంలో, రాజస్థాన్ రాయల్స్ భారతదేశంలోని ప్రముఖ స్పోర్ట్స్ మరియు స్పోర్ట్స్-అనుబంధ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం, రాయల్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (RSB) ని కూడా ప్రారంభించింది.

    ద‌ర‌ఖాస్తు విధానం..
    - ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి (వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి)
    - అందులో మూడుర‌కాల కోర్సులు ఉంటాయి. Self, Guided, Personalized అభ్య‌ర్థి త‌న‌కు న‌చ్చిన కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది.
    - కోర్సు అనంత‌రం స‌ర్టిఫికెట్ అందిస్తారు.
    Published by:Sharath Chandra
    First published: