దేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశ్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైల్వే శాఖలో పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన పలు నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదల కాగా దీనికి సంబంధించిన పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. రైల్వే శాఖలో మొత్తం 1.4 లక్షల పోస్టుల భర్తీకి ఈనెల 15 నుంచి పరీక్షలు మొదలవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్‌సింగ్ ఖాతీ పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నీ కూడా గతేడాది జారీ చేసిన మూడు నోటిఫికేషన్లకు సంబంధించివి కావడం విశేషం. RRB పరీక్షలు డిసెంబర్ 15 నుంచి 28 మధ్య జరగనున్నాయి. దీనికి సంబంధించి సమాచారాన్ని ప్రకటించింది ఇండియన్ రైల్వే. అయితే అభ్యర్థులకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపేది లేదనీ, నేరుగా RBI వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది. కాగా ఈ పరీక్షలకు గానూ దేశ వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 2.44 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్ టిక్కెట్లను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పంపించేశారు. అలాగే RRB బోర్డు అధికారిక వెబ్ సైట్ లో సంబంధిత పరీక్షల వివరాలు, అలాగే వాటి తేదీ, సమయం తెలుసుకునే వీలుంది. అలాగే RRB వెబ్ సైట్ నుంచే పరీక్షకు నాలుగు రోజులు ముందు నుంచే హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. కాగా ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూలు లేకపోవడం విశేషం. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు పరీక్షకు ముందు అభ్యర్థులకు మాక్ టెస్ట్ లింక్స్ కూడా పంపుతున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్సింగ్, అలాగే సానిటైజింగ్, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతీ అభ్యర్థి మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, RRB, South Central Railways