హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం..

Railway Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం..

Railway Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం..

Railway Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భారతీయ రైల్వేలో(Indian Railways) రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈస్టర్న్ రైల్వే(Eastern Railway) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భారతీయ రైల్వేలో(Indian Railways) రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈస్టర్న్ రైల్వే(Eastern Railway) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో దాదాపు 3,000 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ 2022 అక్టోబర్ 29. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrcrecruit.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతి లేదా 8వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(Trade Certificate) కలిగి ఉన్న అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ఉద్యోగాలు(Apprentice Jobs) పొందవచ్చు.

TSRTC Vacancies: గుడ్ న్యూస్.. TSRTCలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలిలా..

విద్యార్హతలు, సెలక్షన్ :

ఈస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఉద్యోగాలకు విద్యార్హత కనీసం పదో తరగతిగా ఉంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌లో కనిష్టంగా 50 శాతం మార్కులు సెక్యుర్ చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా 10వ తరగతి, 8వ తరగతి మార్కుల ఆధారంగా వేర్వేరు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

పదో తరగతి అకడమిక్ మార్కుల శాతం సగటును, ITI పరీక్ష స్కోరును సమాన వెయిటేజీగా నిర్ణయించి లిస్ట్ సిద్ధం చేస్తారు. అలాగే 8వ తరగతి, ITI పరీక్షలలో పొందిన సగటు మార్కుల ఆధారంగా మరో జాబితా తయారు చేస్తారు. తర్వాత రెండు లిస్టుల అగ్రిగేట్ స్కోర్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో అభ్యర్థులు ఇచ్చిన వివరాలను పరిశీలించి ఈస్టర్న్ రైల్వే మెరిట్ లిస్ట్‌ను ప్రిపేర్ చేస్తుంది.

వయోపరిమితి :

అభ్యర్థుల వయసు కనిష్టంగా 15 ఏళ్లు గరిష్టంగా 24 ఏళ్లు అయి ఉండాలి. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు రిలాక్సేషన్ ఉండగా, OBC-NCL అభ్యర్థులకు మూడేళ్లు, PwBD అభ్యర్థులకు పదేళ్ల రిలాక్సేషన్ ఉంది.

దరఖాస్తు ఫీజు.. 

SC/ST/PwBD/Women అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. కానీ, ఇతర కేటగిరీల వారు రూ.100 చెల్లించాలి. ఇది నాన్-రిఫండబుల్ ఫీజు.

 దరఖాస్తు ప్రక్రియ ఇలా.. 

Step 1: అభ్యర్థులు ముందుగా rrcrecruit.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో కనిపించే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 2: అక్కడ మీ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి క్రెడెన్షియల్స్ జనరేట్ చేసుకోవాలి.

Step 3: ఆ తర్వాత అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు పే చేసి ఫామ్ సబ్మిట్ చేయాలి.

Step 4:  అప్లికేషన్ ఫామ్‌ను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

ఉద్యోగ ఖాళీలు పెరగొచ్చు! :

రైల్వే శాఖ అవసరాల ప్రకారం నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ను మొత్తంగా రద్దు చేసే అధికారం కూడా రైల్వే శాఖకు ఉంది. నోటిఫైడ్ ట్రైనింగ్ స్లాట్స్ ఇంక్రీజ్ చేయడం లేదా తగ్గించడం అనేది రైల్వే శాఖ పరిపాలనా నిర్ణయమని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Indian Railway, Indian Railways, JOBS, Jobs in railway

ఉత్తమ కథలు