Home /News /jobs /

RAILWAY RECRUITMENT ICF RECRUITING 782 APPRENTICE POSTS WITH OUT EXAM KNOW APPLICATION PROCESS EVK

Railway Recruitment 2021 : ప‌రీక్ష లేకుండా రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీలో 782 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory), చెన్నైలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 782 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory), చెన్నైలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ (Electrician), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ (Painter) మరియు వెల్డర్ విభాగాల్లో 782 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ నోటిఫికేష‌న్ 27 సెప్టెంబర్ 2021 న విడుదలైంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి 27 సెప్టెంబర్ 2021 నుండి 26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ (University) నుంచి అభ్య‌ర్థి ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలి. పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://pb.icf.gov.in/act/ ను సంద‌ర్శించాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి చ‌ద‌వండి.

    ముఖ్య‌మైన స‌మాచారం..























    పోస్టు పేరు అప్రెంటీస్‌
    మొత్తం ఖాళీలు  782
    ద‌ర‌ఖాస్తుల ప్రారంభం సెప్టెంబ‌ర్ 27, 2021
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 27, 2021
    అధికారిక వెబ్‌సైట్ https://pb.icf.gov.in/act/

    ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇండియాలోని తొలి ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. ఇది అక్టోబర్ 2, 1955 న ప్రారంభించబడింది. 511 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంస్థ‌లో 4000 కంటే ఎక్కువ కోచ్‌లను ఉత్పత్తి చేయడానికి 9500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

    SSC Recruitment 2021: ఎస్ఎస్‌సీలో ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి


    పోస్టుల వివ‌రాలు..











































    పోస్టుపేరు ఫ్రెష‌ర్స్ విభాగం ఎక్స్‌-ఐటీఏ విభాగం
    కార్పెంట‌ర్‌ 31 50
    ఎల‌క్ట్రీషియ‌న్‌ 17 128
    ఫిట్ట‌ర్‌ 43 151
    మెక‌నిస్టు 25 32
    పైయింట‌ర్‌ 34 49
    వెల్డ‌ర్‌ 50 172
    మొత్తం 200 582

    అర్హ‌త‌లు..
    ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 లేదా 12 ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, సంబంధిత ట్రేడ్‌లో ITI డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు అక్టోబర్ 26, 2021 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు 3 సంవత్సరాలు అయితే SC మరియు ST అభ్యర్థుల వరకు సడలింపు ఉంటుంది 5 సంవత్సరాలు.


    Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో 2,945 ఉద్యోగాలు


    ఎంపిక ప్ర‌క్రియ..
    - ఎంపిక విధానం పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
    - అభ్య‌ర్థి అకాడ‌మిక్ అర్హ‌త‌ల ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1:  కేవ‌లం ఆన్‌లైన్ ద్వార మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2:  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు https://pb.icf.gov.in/act/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

    Step 3:  అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4:  త‌రువాత How to Apply ఆప్ష‌న్‌లోకి వెళ్లి అప్లికేష‌న్ విధానం చ‌ద‌వాలి.
    అనంత‌రం అప్లె చేయాలి.

    Step 5:  అభ్య‌ర్థికి ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి విద్యార్హ‌త‌కు సంబంధించిన పూర్తి ధ్రువ‌ప‌త్రాల‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

    Step 6: ద‌ర‌ఖాస్తు అనంత‌రం ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

    Step 7: ప‌రీక్ష ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు.

    Step 8: ద‌ర‌ఖాస్తు అనంత‌రం అప్లికేష‌న్ ఫాంను ప్రింటు తీసుకొని దాచుకోవాలి.

    Step 9:  ద‌ర‌ఖాస్తుకు  26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, India Railways, Job notification, JOBS, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు