హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment 2021 : ఇండియ‌న్ రైల్వేలో 2206 ఖాళీలు.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Railway Recruitment 2021 : ఇండియ‌న్ రైల్వేలో 2206 ఖాళీలు.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భారతీయ రైల్వే (Indian Railway)లో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2206 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...

  భారతీయ రైల్వే (Indian Railway)లో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ (Fitter), మెషినిస్ట్, పెయింటర్ (Painter) వంటి పోస్టులు 2206 భ‌ర్తీ చేయ‌నున్నారు. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 5 చివరి తేదీ. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 24 సంవ‌త్స‌రాలు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు జాబ్ అధికారిక వెబ్‌సైట్ https://rrcecr.gov.in/ ను సంద‌ర్శించాలి.

  ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో డివిజ‌న్‌ల వారీగా ఖాళీల వివ‌రాలు..

  డివిజ‌న్ఖాళీలు
  దానాపూర్ డివిజన్675
  ధన్బాద్ డివిజన్:156
  సోన్‌పూర్ డివిజన్:47
  ప్లాంట్ డిపో/Pt. దీన్ దయాళ్ ఉపాధ్యాయ: 135
  సమస్తిపూర్ డివిజన్81
  Pt దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్892
  క్యారేజ్ & బండి రిపైర్‌ వర్క్‌షాప్110
  మెకానికల్ వర్క్‌షాప్/సమస్తిపూర్:110


  ముఖ్య‌మైన తేదీలు..

  దరఖాస్తు ప్రారంభం- అక్టోబర్ 6, 2021

  దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 5, 2021

  Appsc Recruitment 2021 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే


  వయస్సు-  జ‌న‌వ‌రి 1, 2021 నాటికి 15 నంచి 24 ఏళ్లు

  దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

  ఎంపిక ప్రక్రియ..

  విద్యార్హ‌త : టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

  Step 1 : ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలిస్తారు.

  Step 2 : అభ్య‌ర్థుల అక‌డ‌మిక్ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

  Step 3 : మెరిట్, వ‌య‌సు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 : అభ్యర్థులు https://rrcecr.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2 : హోమ్ పేజీలో Online Act Apprentice Application లింక్ పైన క్లిక్ చేయాలి.

  Step 3 :  ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

  Step 4 : New Registration పైన క్లిక్ చేయాలి.

  Step 5 : ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 6- లాగిన్ అయిన తర్వాత విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

  Step 7- ఫోటో, సంతకం, విద్యార్హతల సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

  Step 8 : ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

  Step 9 : అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, India Railways, Job notification, JOBS, Railway Apprenticeship

  ఉత్తమ కథలు