Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్

Railway Recruitment Board Level 1 Notification | మార్చి 12న 1,00,000 లెవెల్-1(గ్రూప్-డీ) ఉద్యోగాలకు డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది.

news18-telugu
Updated: March 11, 2019, 6:16 PM IST
Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్
Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్
news18-telugu
Updated: March 11, 2019, 6:16 PM IST
రైల్వేలో ఉద్యోగాల పండుగ కొనసాగుతోంది. ఇప్పటికే వేర్వేరు కేటగిరీల్లో పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన ఆర్ఆర్‌బీ... మార్చి 12న అతిపెద్ద కొలువుల జాతరకు తెరతీయబోతోంది. వందలు కాదు వేలు కాదు... ఏకంగా ఒక లక్ష లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాలకు మార్చి 12న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను గత నెలలోనే విడుదల చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. మొత్తం 1,30,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పిన ఆర్ఆర్‌బీ... 10 రోజుల్లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక  1,00,000 లెవెల్-1(గ్రూప్-డీ) ఉద్యోగాలకు మార్చి 12న డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది.

Read this: డిగ్రీ ఉంటే చాలు... బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు...

RRB Level 1 Notification, RRB Level 1 Jobs, Railway Recruitment Board New notification, Railway jobs, Railway exams, RRB Notification, railway one lakh jobs, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులు, రైల్వే లక్ష ఉద్యోగాలు, రైల్వే పరీక్షలు, రైల్వే ఉద్యోగాలు, రైల్వే నోటిఫికేషన్
ఇండియన్ రైల్వేస్


1,00,000 లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. ఈ పోస్టుల్ని దేశంలోని అన్ని జోన్లల్లో భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. లెవెల్-1 లేదా గ్రూప్-డీలో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ IV (ట్రాక్‌మ్యాన్), గేట్‌మ్యాన్, పాయింట్స్‌మ్యాన్, హెల్పర్, పోర్టర్ లాంటి పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. అయితే వేర్వేరు పోస్టుల్ని బట్టి అర్హత మారుతుంది. కాబట్టి పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివరాలు చూడాలి. అభ్యర్థుల్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. కొద్ది రోజుల క్రితమే రైల్వే 62,000 లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాల భర్తీలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు మరో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తోంది.



Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:
Loading...
Realme 3 Sale: రేపే రియల్‌మీ 3 సేల్... ధర రూ.8,999... జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్

EPFO: ఉద్యోగం మారారా? ఈపీఎఫ్ అకౌంట్ ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్

Voter Helpline App: ఓటర్ హెల్ప్‌లైన్ యాప్... ఎలా వాడాలో తెలుసుకోండి
First published: March 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...