Home /News /jobs /

RAILWAY RECRUITMENT BOARD WILL HOLD THE SIXTH PHASE OF THE CBT 1 EXAM FOR NTPC EXAMS FROM APRIL 1 HERE THE DETAILS GH SRD

RRB NTPC CBT-1 ఆరో దశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి... అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RRB NTPC exam : కరోనా మహమ్మారి ఉద్యోగ నియామక ప్రక్రియలపై కూడా ప్రభావం చూపింది. వైరస్ వ్యాప్తి వల్ల ఏటా జరగాల్సిన పోటీ పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి ఉద్యోగ నియామక ప్రక్రియలపై కూడా ప్రభావం చూపింది. వైరస్ వ్యాప్తి వల్ల ఏటా జరగాల్సిన పోటీ పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) విభాగంలోని CBT-1 ఆరో దశ పరీక్షలను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో పరీక్ష జరగనుంది. అడ్మిట్ కార్డులను సంబంధిత ప్రాంతీయ రైల్వే వెబ్‌సైట్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు వీటిని అభ్యర్థులకు విడుదల చేయనున్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. NTPC పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. వీటిని అడ్మిట్ కార్డుపై ప్రచురిస్తున్నారు. ఫేస్ మాస్క్ ధరించిన అభ్యర్థులను మాత్రమే ఎగ్జామ్ సెంటర్‌ లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ముగిసే వరకు మాస్క్ తప్పక ధరించాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, కాలిక్యులేటర్లు, మెటాలిక్ ఆభరణాలు, గాజులు, బెల్టులు, బ్రాస్‌లెట్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వంటి వాటిని సెంటర్ లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.

* దశలవారీగా పరీక్ష
CBT-1 పరీక్షకు మొత్తం 1.26 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియమామక ప్రక్రియలో మొత్తం 35,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎక్కువమంది అభ్యర్థులు ఉన్నందువల్ల దశలవారీగా పరీక్ష నిర్వహిస్తున్నారు. CBT-1 లెవల్‌ను పూర్తి చేసిన వారిని తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తవుతుంది. తుది ఫలితాల్లో ఎంపికైనవారిని ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్ వంటి పోస్టుల్లో నియమిస్తారు.

* అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రీజినల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల వెబ్‌సైట్ల నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్ల వివరాలు..

గౌహతి – www.rrbguwahati.gov.in

జమ్మూ – www.rrbjammu.nic.in

కోల్‌కత – www.rrbkolkata.gov.in

మాల్దా – www.rrbmalda.gov.in

ముంబై – www.rrbmumbai.gov.in

ముజఫర్ పూర్ – www.rrbmuzaffarpur.gov.in

పాట్నా – www.rrbpatna.gov.in

రాంచీ – www.rrbranchi.gov.in

సికింద్రాబాద్ – www.rrbsecunderabad.nic.in

అహ్మదాబాద్ – www.rrbahmedabad.gov.in

అజ్మేర్ – www.rrbajmer.gov.in

అలహాబాద్ – www.rrbald.gov.in

బెంగళూరు – www.rrbbnc.gov.in

భోపాల్ – www.rrbbpl.nic.in

భువనేశ్వర్ – www.rrbbbs.gov.in

బిలాస్‌పూర్ – www.rrbbilaspur.gov.in

చండీఘడ్ – www.rrbcdg.gov.in

చెన్నై – www.rrbchennai.gov.in

గోరక్‌పూర్ – www.rrbguwahati.gov.in

సిలిగురి – www.rrbsiliguri.org

తిరువనంతపురం – www.rrbthiruvananthapuram.gov.in
Published by:Sridhar Reddy
First published:

Tags: Indian Railways, RRB

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు