హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Jobs: రైల్వేలో ఉద్యోగానికి అప్లై చేస్తే ఈ విషయాలు మర్చిపోవద్దు

RRB Jobs: రైల్వేలో ఉద్యోగానికి అప్లై చేస్తే ఈ విషయాలు మర్చిపోవద్దు

RRB Jobs: రైల్వేలో ఉద్యోగానికి అప్లై చేస్తే ఈ విషయాలు మర్చిపోవద్దు
(ప్రతీకాత్మక చిత్రం)

RRB Jobs: రైల్వేలో ఉద్యోగానికి అప్లై చేస్తే ఈ విషయాలు మర్చిపోవద్దు (ప్రతీకాత్మక చిత్రం)

Railway Recruitment Board Message | భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నియామక ప్రక్రియ నిర్వహిస్తుంది. పలు దశల్లో కంప్యూటరైజ్డ్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది.

  మీరు రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారా? రైల్వేలో జాబ్ మీ కలా? రైల్వేలో మీరు ఉద్యోగానికి అప్లై చేసినా, అప్లై చేయాలనుకున్నా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రైల్వేలో నియామకాలన్నీ రైల్వే జోన్లు లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు మాత్రమే నిర్వహిస్తాయి. కానీ రైల్వే ఉద్యోగాలకు ఉన్న డిమాండ్లను క్యాష్ చేసుకునేందుకు రైల్వే ఉద్యోగాల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇటీవల లక్షన్నరకు పైగా ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే నిరుద్యోగుల కలల్ని క్యాష్ చేసుకునేందుకు ముఠాలు రంగంలోకి దిగుతుంటాయి. నిరుద్యోగుల్లో రైల్వే ఉద్యోగానికి డిమాండ్ చాలా ఎక్కువ కావడంతో మోసాలు చేస్తుంటాయి. లక్షన్నర పోస్టుల్ని రైల్వే భర్తీ చేస్తుండటంతో ఈ సమయంలోనే మోసాలు ఎక్కువ. అందుకే మోసపోవద్దంటూ ఆర్ఆర్‌బీ అభ్యర్థుల్ని అప్రమత్తం చేస్తోంది. జాగ్రత్తగా ఉండాలంటూ పలు హెచ్చరికలు జారీ చేసింది.

  అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ హెచ్చరికలు ఇవే...


  రైల్వే ఉద్యోగాల నియామకంలో దళారుల ప్రమేయం ఉండదు.

  రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్ మాటలు నమ్మొద్దు.

  జాబ్ రాకెట్ నిర్వహించేవారి వలలో పడి మోసపోవద్దు.

  రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా అంటే స్థానికంగా ఉండే ఆర్ఆర్‌బీకి సమాచారం ఇవ్వాలి.

  మోసగాళ్లపై ఆర్ఆర్‌బీకి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.

  ఫిర్యాదు చేసినవారి పేర్లను గోప్యంగా ఉంచుతుంది ఆర్ఆర్‌బీ.

  RRB Warning, RRB Jobs, RRB Notifications, RRB Level 1 Jobs, RRB NTPC Jobs, RRB latest jobs, Railway jobs, రైల్వే ఉద్యోగాలు, ఆర్ఆర్‌బీ హెచ్చరిక, ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్, రైల్వే జాబ్స్, ఆర్ఆర్‌బీ లెవెల్ 1 జాబ్స్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీసీపీ జాబ్స్
  image: RRB

  భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నియామక ప్రక్రియ నిర్వహిస్తుంది. పలు దశల్లో కంప్యూటరైజ్డ్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. ఆర్ఆర్‌బీ తరఫున ఏజెంట్లు ఎవరూ ఉండరు. ఆర్ఆర్‌బీ ఎలాంటి కోచింగ్ సెంటర్లు నిర్వహించదు. రైల్వే నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్, వార్తాపత్రికలు, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఫాలో కావాలి. ఎవరి మాటలూ నమ్మొద్దు. రికమండేషన్లతో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని అస్సలు నమ్మొద్దు. ఒకవేళ మీరు అడ్డదారుల్లో ఉద్యోగం సంపాదించాలని చూస్తే పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఆర్ఆర్‌బీ. అందుకే ఎవరైనా రేల్వే ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్తే ఆర్ఆర్‌బీకి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

  Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ

  Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, EMPLOYMENT, Exams, Indian Railways, JOBS, NOTIFICATION, Railways, RRB

  ఉత్తమ కథలు