Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? మరోసారి దరఖాస్తుల పరిశీలన

Railway Jobs | మొత్తం 1,03,769 లెవెల్ 1 లేదా గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB 2019 ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

news18-telugu
Updated: August 12, 2019, 3:56 PM IST
Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? మరోసారి దరఖాస్తుల పరిశీలన
Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? మరోసారి దరఖాస్తుల పరిశీలన (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 12, 2019, 3:56 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB లెవెల్ 1 నోటిఫికేషన్‌‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సంతకం, ఫోటో కారణాల వల్ల రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మళ్లీ పరిశీలించనుంది. తమ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయంటూ అనేక మంది అభ్యర్థులు ఆర్ఆర్‌బీకి ఫిర్యాదులు చేశారు. దరఖాస్తుల తిరస్కరణపై వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించాలని ఆర్ఆర్‌బీ నిర్ణయించింది. ఫోటో, సిగ్నేచర్ కారణాలతో రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని పరిశీలిస్తామని, వివరాలను ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా 2019 ఆగస్ట్ 31 లోగా అభ్యర్థులకు సమాచారం ఇస్తామని, తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత రీజియన్ వెబ్‌సైట్ చూడాలని ఆర్ఆర్‌బీ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొత్తం 1,03,769 లెవెల్ 1 లేదా గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB 2019 ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు జూలై 31 వరకు లింక్‌ను యాక్టీవ్‌లో ఉంచింది. అయితే దరఖాస్తుల తిరస్కరణపై అభ్యర్థుల నుంచి వేలల్లో ఫిర్యాదులు రావడంతో వాటిని మళ్లీ పరిశీలించాలని ఆర్ఆర్‌బీ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల పరిశీలన 2019 ఆగస్ట్ 31 లోపు ముగుస్తుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు




ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...
Loading...
RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...